హరికృష్ణ కారు 120 కి.మీ వేగంతో వెళుతోంది: కారులో ఉన్న శివాజీ

సినీ నటుడు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి - అద్దంకి రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాద సమయంలో హరికృష్ణే కారు నడుపుతున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు అరికెపూడి శివాజీ, వెంకట్రావ్‌లు ప్రయాణిస్తున్నారు. వారు తీవ్రగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Recommended Video

    హరికృష్ణ కొంప ముంచిన వాటర్ బాటిల్...!

    నెల్లూరు జిల్లా కావలిలో ఓ ఫంక్షన్ అటెండ్ అయ్యేందుకు బుధవారం ఉదయం 4:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరినట్లు తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరైన అరికెపూడి శివాజీ చెప్పారు. శివాజీ హరికృష్ణ పక్కనే కూర్చుని ఉండగా... వెంకట్రావ్ వెనక సీటులో కూర్చున్నాడని చెప్పాడు. ప్రమాద సమయంలో కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని... ఒక రాయిని ఎక్కడంతో కారు అదుపు తప్పిందని శివాజీ తెలిపాడు. హరిక‌ృష్ణ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే కారులోనుంచి బయటకు ఎగరి పడ్డారని శివాజీ చెప్పాడు.

    Hari Krishnas car was travelling at a speed of 120KM H,says injured Arikepudi Shivaji

    ప్రమాద స్థలంలో రెండు వాహనాలు ఉండడంతో హరికృష్ణ రోడ్డుపై పడిపోవడంతో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు ఆ వాహనాన్ని ఢీ కొట్టి పల్టీ కొట్టిందా..? వేరే వాహనం రాంగ్‌రూట్‌లో వచ్చి ఎదురుగా ఢీకొట్టిందా..?...అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న నందమూరి కుటుంబసభ్యులు,అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.ప్రమాదం విషయం తెలియగానే హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆస్పత్రికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు, నారా లోకేష్ కూడా హైదరాబాదుకు బయలుదేరారు. హరికృష్ణకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+