తెలంగాణ ద్రోహి, ఏపి ప్రజలే రాళ్లతో తరిమికొడ్తారు: చంద్రబాబుపై హరీశ్ రావు ఫైర్

హైదరాబాద్: పేద ప్రజలు, రైతులకు నీళ్లు అందించే పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ద్రోహి అని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. పేదల తాగునీటి అవసరాల కోసం కడుతున్న పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని మండిపడ్డారు.

గురువారం హరీశ్ రావు మీడియా మాట్లాడుతూ.. 9ఏళ్లపాటు పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు చేసేందేమి లేదని అన్నారు. ఇప్పుడు తెలంగాణ సిఎం కెసిఆర్ పాలమూరు ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇందుకోసమే చంద్రబాబును తెలంగాణ ద్రోహిగా డిక్లేర్ చేస్తున్నానని చెప్పారు.

అప్పుడు దత్తత తీసుకుని ఏమి చేయని చంద్రబాబు.. ఇప్పుడు వలసలు పోతున్న పాలమూరు జిల్లాలో ప్రాజెక్టును అడ్డుకుని మరోసారి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ప్రభుత్వంలోనే అనుమతులు వచ్చిన ప్రాజెక్టును.. కొత్త ప్రాజెక్టు అని చంద్రబాబు అంటున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.

Harish Rao fires at Chandrababu naidu

ఉమ్మడి రాష్ట్రానికి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలోనే పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం కోసం జీవో 72ను 8/8/2013లో జారీ చేశారని తెలిపారు. ఆ జీవో ప్రకారమే సిఎం ప్రాజెక్టును నిర్మించతలపెట్టారని అన్నారు. చంద్రబాబు ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కేంద్రానికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు.

పాలమూరు ప్రజల నోటికాడి బుక్కను ఎత్తగొడతున్నాడని, వారి నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ఏపిలో మూడో పంట కోసం పట్టిసీమ ప్రారంభించిన చంద్రబాబు.. తెలంగాణలో ఒక్క పంట కోసం కడుతున్న పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘మనిషివేనా? మానవత్వం ఉందా? మానత్వం ఉంటే ఇలా చేస్తావా' అని చంద్రబాబుపై హరీశ్ తీవ్రంగా మండిపడ్డారు.

చంద్రబాబులా ఆలోచించే మనుషులుంటారా? అని ప్రశ్నించారు. మాట్లాడితే తెలుగుజాతి అంటారు కానీ, చేతలు మాత్రం ఒకవైపు ఉంటాయని ధ్వజమెత్తారు. విశాఖలో తుఫాను వస్తే తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ ఫార్మర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నీళ్లు పంపించిందని చెప్పారు. తెలంగాణలో ఫ్లోరైడ్ బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు కడుతుంటే.. ఏపి ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు.

హైదరాబాద్‌లోనే ఉంటానంటున్న చంద్రబాబు.. ఇక్కడి వారికి నీళ్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబం నీళ్లు లేకుంటే, హేరిటేజ్ పాలు తాగి బతుకుందేమో కానీ, ఇక్కడి మిగితా ఆంధ్రా, ఇతర రాష్ట్రాల ప్రజలకు నీళ్లు కావాలి కదా అన్నారు. చంద్రబాబు తీరు మార్చుకోకుంటే హైదరాబాద్‌లో ఏపి ప్రజలే రాళ్లతో తరిమికొడతారని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వెనకబడిపోయిన పాలమూరు.. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. అప్పటి సిఎం కిరణ్ కుమార్ పాలమూరు ప్రాజెక్టు కోసం జీవో జారీ చేస్తే.. వైయస్ సర్వే చేయించారని, అప్పుడు చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అప్పుడు తెలంగాణలోని ప్రజల ఓట్లు అవసరం కాబట్టి ప్రాజెక్టును అడ్డుకోలేదని ఆరోపించారు.

ఎట్టి పరిస్థితిల్లోనూ పాలమూరు ప్రాజెక్టును కట్టితీరుతామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. వచ్చే నెలలోనే టెండర్లు పిలుస్తామని, లాండ్ అక్వైషెషన్ కోసం కమిటీ వేశామని తెలిపారు. ప్రాజెక్టును కట్టి పాలమూరు ప్రజల కళ్లల్లో ఆనందం నింపుతామని చెప్పారు. చంద్రబాబు దగ్గర జీవో 72 లేకుంటే.. పంపిస్తామని హరీశ్ రావు చెప్పారు.

కేంద్రానికి ఏపి ప్రభుత్వం ఫిర్యాదు చేసిన ప్రతి అందిందని.. దానికి జతచేస్తూ తెలంగాణ ప్రభుత్వం వివరణ పంపిస్తామని చెప్పారు. ఏపి ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాసిన లేఖకు కూడా సమాధానం పంపుతామని చెప్పారు.

పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నా ఏపి ప్రజల గురించి ఆలోచించి అడ్డుకోలేదని.. పాలమూరు ప్రాజెక్టు కడతామనగానే చంద్రబాబు అడ్డుకునేందుకు కుట్రలు ప్రారంభించారని హరీశ్ రావు మండిపడ్డారు. పక్కవారు బాగుంటే ఓర్చుకోలేని తత్వమని, పాలమూరు ప్రజల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని మండిపడ్డారు. ఏదేమైనా పాలమూరు ప్రాజెక్టును కట్టి ఇక్కడి ప్రజల ఆకలి తీరుస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+