హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు అడ్డుకున్నారంటే ఓ లెక్క! ఆధారాలతో కాంగ్రెస్‌ను ఏకేసిన హరీశ్: ‘దామోదర కారులో కోదండరాం’!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం దక్కలేదనే నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు.. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలేదని.. ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకే 2014లో తెలంగాణ ఇచ్చే ప్రయత్నం చేశారని అన్నారు. అంతకుముందే తెలంగాణ ఇచ్చివుంటే అనేక మంది బలికావాల్సి ఉండేది కాదని అన్నారు.

అధికార దాహంతో కుట్రలు

అధికార దాహంతో కుట్రలు

తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం ఉండబట్టే 2014 ఎన్నికల్లో గెలిపించారని హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరం, ఇతర నీటి ప్రాజెక్టులపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీదంతా అధికారం కోసం తాపత్రయమేనని అన్నారు. కాళేశ్వరం నీళ్లు రైతులకందితే శాశ్వతంగా అధికారంకు దూరమైతామనే భయం కాంగ్రెస్ పార్టీకి పట్టుకుందని అన్నారు. కుట్రలతోనే కోర్టుల్లో తప్పుడు కేసులు వేస్తున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తప్పుడు కేసులతో భూసేకరణ అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ అంటేనే అవినీతి.. నాగం కూడా చెప్పారు

కాంగ్రెస్ అంటేనే అవినీతి.. నాగం కూడా చెప్పారు

రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతున్న ప్రభుత్వంపై బురదజల్లే పనులు చేస్తోందని మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని హరీశ్ విమర్శించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి కూడా గతంలో కాంగ్రెస్ చేపట్టిన జలయయజ్ఞాన్ని ధనయజ్ఞం అని తిట్టారని గుర్తు చేశారు. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. అధికార దాహంతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని హరీశ్ దుయ్యబట్టారు.

బాబు అడ్డుకున్నారంటే ఓ లెక్క.. కానీ..

బాబు అడ్డుకున్నారంటే ఓ లెక్క.. కానీ..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఫిర్యాదులు చేశారని హరీశ్ చెప్పారు. తమ రాష్ట్రానికి నీళ్లు తక్కువ వస్తాయేమోననే ఆలోచనతో చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఓ లెక్క ఉంటుంది.. కానీ, మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. తమ రాష్ట్రానికి న్యాయంగా వచ్చే నీటిని వాడుకుంటున్నా చంద్రబాబు ఇష్టం లేదని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

ప్రాణహిత ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రారంభించినప్పుడు తాము అడ్డుకున్నామా? అని హరీశ్ ప్రశ్నించారు. అప్పుడు ఏ అనుమతులు లేవు.. అయినా తెలంగాణ కోసం తాము అడ్డుకోలేదని చెప్పారు. వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని మాత్రమే కోరామని తెలిపారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.. రైతులు, రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా?

ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా?

తెలంగాణలో ఏ ప్రాజెక్టునైనా పూర్తి చేసిందా? అని హరీశ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పోచంపాడు పూర్తి చేయలేదు, దేవాదులను పూర్తి చేయలేదు, లోయర్ పెనుగంగా ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని అన్నారు. ఎల్లంపల్లిని పూర్తి చేశామని చెప్పుకోవడం సరికాదన్నారు. రూ.500కోట్లుతో 2016లో ఎల్లంపల్లిని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు. అధికారంలో ఉన్న 8ఏళ్లలో కూడా మిడ్ మానేరు ప్రాజెక్టును కాంగ్రెస్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. 1450కోట్ల వ్యయంతో తామే పూర్తి చేశామన్నారు. ఉమ్మడి ఏపీలో గోదావరిపై ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేశారా? అని హరీశ్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. మధ్య తరగతి ప్రాజెక్టులకు అనుమతులు రాకుండానే ప్రారంభోత్సవాలు చేయడం, ఆపేయడం కాంగ్రెస్ చేసిన పని అని దుయ్యబట్టారు.

దామోదర కారులో కోదండరాం ఎలా వచ్చారు??

దామోదర కారులో కోదండరాం ఎలా వచ్చారు??

కాంగ్రెస్, జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటారా? అని హరీశ్ ధ్వజమెత్తారు. మల్లన్న సాగర్‌కు కోదండరాం మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కారులో వెళ్లారని.. అక్కడి ప్రజలను భూములు ఇవ్వకూడదని కోరారని తెలిపారు. కోదండరాం ఇప్పుడు ఎవరి మనిషో తేలిపోయిందని అన్నారు.

చనిపోయిన వ్యక్తులతో ఫిర్యాదులు.. లక్షలు ఖర్చు పెట్టి

చనిపోయిన వ్యక్తులతో ఫిర్యాదులు.. లక్షలు ఖర్చు పెట్టి

కాంగ్రెస్ పార్టీ చనిపోయిన వ్యక్తులతో కూడా కోర్టులో ఫిర్యాదులు చేయించిందని హరీశ్ విమర్శించారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తోందని హరీశ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత కూడా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి కోర్టుల్లో ఫిర్యాదు చేసింది పీసీసీ కార్యదర్శి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడని తెలిపారు. వారు దామోదర రాజనర్సింహకు అత్యంత సన్నిహితులని చెప్పారు. ఈ సందర్భంగా హరీశ్ పలు ఆధారాలను చూపించారు.

అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు

అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటోందని హరీశ్ రావు విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని, అప్పుడున్న మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రాజెక్టుపై సంప్రదిస్తే తమకు సహకరించలేదని చెప్పారు. ఆ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక.. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని ప్రాజెక్టులకు అంగీకరించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పారు. ప్రాణహిత వద్ద నీళ్లు లేవని సీడబ్ల్యూసీ చెప్పిన తర్వాతే.. ప్రాణహితను కాళేశ్వరానికి మార్చామని హరీశ్ రావు వివరించారు.

English summary
Telangana minister Harish Rao on Tuesday fired at Congress, AP CM Chandrababu Naidu and Kodandaram for water projects issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X