హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుద్ధి చెప్తారు: హరీష్, అంతర్జాతీయ వేదికపై 'మిషన్ కాకతీయ', వరల్డ్ వాటర్ వీక్ ఆహ్వానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని మంత్రి హరీశ్ రావు సోమవారం నాడు చెప్పారు. పేదలకు డబుల్ బెడ్ రూంల ఇళ్లు కట్టించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రజా శ్రేయస్సుకు అడ్డుపడుతున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

కాగా, మిషన్ కాకతీయ పథకం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ జల వారోత్సవం సందర్భంగా ఈ నెల 23 నుంచి 28 వరకు స్వీడన్‌లోని స్టాక్‌హోంలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు పిలుపు వచ్చింది.

స్టాక్‌హోం ఇంటర్నేషనల్ వాటర్ ఇన్‌స్టిట్యూట్ ప్రతిఏటా అంతర్జాతీయ సదస్సు నిర్వహించడంతోపాటు ఈ రంగంలో విశేష కృషిచేస్తున్న వారికి నోబెల్ బహుమతితో సమానమైన వాటర్ ప్రైజ్‌ను అందజేస్తున్నది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్‌ను 2015కుగాను స్టాక్‌హోం వాటర్‌ప్రైజ్ వరించింది.

హరీష్ రావు

హరీష్ రావు

హయత్‌నగర్ మండలంలో రూ.53.38 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, భువనగరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిలతో కలసి హరీష్ రావు సోమవారం శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

 హరీష్ రావు

హరీష్ రావు

స్నేహ మహిళా సహకార పొదుపు పరపతి సంఘం 14వ సర్వసభ్య సమావేశం సందర్భంగా హయత్‌నగర్‌లో నిర్వహించిన సభలో హరీశ్ రావు మాట్లాడారు.

హరీష్ రావు

హరీష్ రావు

సీఎం కెసిఆర్ రాష్ట్రంలోని ప్రతి మహిళా సంఘానికి రూ.10లక్షల వరకు వడ్డిలేని రుణాలను త్వరలో అందిస్తారని చెప్పారు.

హరీష్ రావు

హరీష్ రావు


60 ఏండ్లు నిండిన ప్రతి వ్యక్తికి త్వరలోనే పెండింగ్ డబ్బులతోసహా చెల్లిస్తామన్నారు. హయత్‌నగర్‌లో స్థలం కేటాయిస్తే రూ.3 కోట్లతో 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యంగల గోదామును నిర్మిస్తామన్నారు.

 హరీష్ రావు

హరీష్ రావు

ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని గత సంత్సరకాలంలో రూ.100 కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. రానున్న కాలంలో కొత్త కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని మహేందర్ రెడ్డి చెప్పారు.

English summary
Telangana Minister for Irrigation T. Harish Rao has received an invitation for participation in the World Water Week organised by the Stockholm International Water Institute (SIWI) every year at Stockholm, Sweden, from August 23 to 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X