కాంగ్రెస్, బీజేపీల కుట్రే: కవిత అరెస్టుపై హరీశ్ రావు, రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలు

కాంగ్రెస్, బీజేపీల రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. కవిత అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.. శని, ఆదివారం కోర్టుకు సెలవు ఉంటుందని తెలిసి పథకం ప్రకారమే కవితను శుక్రవారం అరెస్ట్ చేశారన్నారు.

రాజకీయ దురుద్దేశంతో తమపై బురద జల్లాలని.. రాజకీయంగా తమను దెబ్బతీయాలనే ఒక పథకం ప్రకారం కుట్రతో కవితను బీజేపీ అరెస్టు చేయించిందని హరీశ్ రావు ఆరోపించారు. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ఈ అరెస్టుపై ఇప్పటికే కేంద్రమంత్రి సహా బీజేపీ నాయకులు చాలా సార్లు ప్రకటనలు చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు.

Harish Rao hits out at bjp and congress for arresting BRS MLC Kavitha

రేపు పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వబోతున్నామని.. ఈసీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ కవితను అరెస్టు చేయడం బీఆర్‌ఎస్‌ పార్టీని, కేసీఆర్‌ను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నమని హరీశ్ రావు ఆరోపించారు. తమను డీమోరలైజ్‌ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి కుట్రలు పన్నుతున్నాయని హరీశ్ రావు మండిపడ్డారు.

అరెస్టులు, వేధింపులు కొత్త కాదు

బీఆర్‌ఎస్‌ ఉద్యమాల పార్టీ అని చెప్పిన హరీశ్‌రావు.. తమకు అరెస్టులు, వేధింపులు, కుట్రలు కొత్తేమీ కాదన్నారు. ఇలాంటి ఎన్నో కుట్రలు, అక్రమ కేసులు, అరెస్టులను చేధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ తమదన్నారు. 14 ఏళ్లు పోరాడి.. రానే రాదు అన్న రాష్ట్రాన్ని సాధించిన పార్టీ తమ బీఆర్‌ఎస్‌ పార్టీ అని చెప్పారు.

ఈ కుట్రను రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు. దీనిపై న్యాయవాదులతో సంప్రదించి అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టులో వెంటనే పిటిషన్‌ వేసి.. న్యాయపరంగా పోరాడతామని హరీశ్ రావు తెలిపారు. కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హరీశ్ రావు చెప్పారు.

మూడు రోజుల తర్వాత ఈ కేసు విచారణకు వస్తుండగా.. అంత తొందరగా ఎందుకు కవితను అరెస్టు చేయాల్సి వచ్చిందని హరీశ్ రావు ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో తమను దెబ్బతీయాలనే కుట్రనే ఇది అని రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. ఒక ఎమర్జెన్సీని మించిన పరిస్థితి ఇవాళ కనిపించిందని అన్నారు. ఈ ప్రజాస్వామిక చర్యలకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా శనివారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని తమ పార్టీ పిలుపునిస్తుందని హరీశ్ రావు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+