బాబూ! పిచ్చివేషాలేస్తే సంగతి చూస్తాం, కేసీఆర్ దెబ్బకు ఏపీకి, రికార్డులు తీస్తాం: హరీష్ కీలకవ్యాఖ్యలు

Recommended Video

    Telangana Elections 2018 : బాబూ! పిచ్చివేషాలేస్తే సంగతి చూస్తాం.. -హరీష్ రావు | Oneindia Telugu

    గజ్వెల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి (ఆపద్ధర్మ) హరీష్ రావు ఆదివారం నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్, టీడీపీ మైండ్ బ్లాంక్ అయిందని ఎద్దేవా చేశారు. ఆయన మెదక్, గజ్వెల్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

    ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నష్టం చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. చంద్రబాబూ! అలాంటి ఉద్దేశ్యం ఉంటే ఖబడ్దార్.. అని హరీష్ రావు హెచ్చరించారు.

    కేసీఆర్ దెబ్బకు అమరావతిలో, పిచ్చివేషాలు వేస్తే రికార్డులు తీస్తాం

    కేసీఆర్ దెబ్బకు అమరావతిలో, పిచ్చివేషాలు వేస్తే రికార్డులు తీస్తాం

    తమ పార్టీ అధినేత కేసీఆర్ కొట్టిన దెబ్బకు చంద్రబాబు అమరావతిలో పడ్డారని హరీష్ రావు విమర్శించారు. చంద్రబాబు పిచ్చివేషాలు వేస్తే భవిష్యత్తులో సంగతి ఏమిటో చూస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ వద్ద ఉన్న రికార్డులు ముందు ముందు బయటపెడతామని చెప్పారు. చాలా ఉన్నాయని, వివరాలు ఉన్నాయని తీస్తామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ క్వార్టర్ సీసాలు, చంద్రబాబు డబ్బులు వద్దని చెబుతున్నారని అన్నారు.

    కాంగ్రెస్‌కు దమ్ముంటే చంద్రబాబుతో ప్రచారం చేయించాలి

    కాంగ్రెస్‌కు దమ్ముంటే చంద్రబాబుతో ప్రచారం చేయించాలి

    అమరావతి నుంచే కాంగ్రెస్ పార్టీకి టిక్కెట్లు, నోట్ల కట్టలు, స్క్రిప్ట్ వస్తోందని హరీష్ రావు నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికులకు భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ఉంటే తెలంగాణలో చంద్రబాబుతో ప్రచారం చేయించాలని సవాల్ చేశారు.

    దేశానికే ఆదర్శం

    దేశానికే ఆదర్శం

    తమ పాలనలో రూపాయి ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటు ఎందుకు వేస్తారని హరీష్ రావు అన్నారు. పింఛన్ ఇచ్చే తమ పార్టీకే ఓటు వేస్తారన్నారు. అభివృద్ధి నమూనాకు దేశానికే తెలంగాణ ఆదర్శమని చెప్పారు.

    గజ్వెల్‌లో హరీష్ రావు

    గజ్వెల్‌లో హరీష్ రావు

    మొదట గజ్వెల్‌లో నిర్వహించిన ముస్లీం మైనార్టీ గర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అభివృద్ధిలో గజ్వేల్ దూసుకుపోతోందన్నారు. కాంగ్రెస్, టీడీపీల పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. నాలుగేళ్లలోనే గజ్వెల్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముస్లీంల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముస్లీంలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.

    చంద్రబాబు సంగతి చూస్తాం

    చంద్రబాబు సంగతి చూస్తాం

    కేసీఆర్ కొట్టిన దెబ్బకు చంద్రబాబు అమరావతిలో పడ్డారని, చంద్రబాబు పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తులో సంగతి చూస్తామని, తమ వద్ద ఉన్న రికార్డులు బయట పెడతామని హరీష్ రావు హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యాఖ్యలు ఓటుకు నోటు కేసును గుర్తు తెస్తున్నాయని అంటున్నారు. ఓటుకు నోటు కేసు రికార్డులు ఏం ఉన్నాయి, చంద్రబాబుకు సంబంధించిన అంశాలు ఏం బయటపెడతారనే చర్చ సాగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+