రాజకీయాలొద్దు, అవినీతిపై కఠినమే: మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్: తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయపై రాజకీయాలు చేయొద్దని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మిషన్ కాకతీయలో అవినీతి జరుగుతుందంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారు.
నిధులు విడుదల చేయకుండానే అవినీతి ఎట్ల జరుగుతదో చెప్పాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అవసరమైతే సలహాలు ఇవ్వండి కానీ, బురదజల్లే కార్యక్రమాలు వద్దని హితవు పలికారు. రాజకీయ దరుద్దేశంతోనే కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

‘తప్పులు జరిగితే కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయండి. 20 శాతం లెస్ చేయడంతో ప్రభుత్వానికి రూ. 500 కోట్లు ఆదా అయ్యింది. రూ. 2 కోట్ల విలువైన మట్టిని రైతులు పొలాలకు తీసుకెళ్లారు. మిషన్ కాకతీయలో తప్పులు జరిగితే చర్యలు తప్పవు అ'ని మంత్రి పేర్కొన్నారు.
మిషన్ కాకతీయలో పారదర్శకతకు పెద్ద పీట వేశామని చెప్పారు. అవినీతి, అక్రమాలకు తావు లేదని.. ఎక్కడ జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు స్పష్టం చేశారు. వర్షాలు తగ్గాక మిగితా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో మిషన్ కాకతీయ విజయవంతమవుతోందని అన్నారు.












Click it and Unblock the Notifications