తెలంగాణలో క్యాష్‌లెస్ ఇబ్రహీంపూర్: హరీశ్‌కు వెంకయ్య అభినందనలు

దేశంలో రెండవ నగదు రహిత గ్రామంగా ఇబ్రహీంపూర్ నిలిచినందుకు కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ వేదికగా తెలంగాణ మంత్రి హరీశ్ రావును అభినందించారు.

సిద్దిపేట: దేశంలో రెండవ నగదు రహిత గ్రామంగా ఇబ్రహీంపూర్ నిలిచినందుకు కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు ట్విట్టర్‌లో అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామం దేశంలో రెండవ నగదు రహిత గ్రామంగా నిలిచిందని తెలిపారు.

నీళ్లు, రేషన్‌, కిరాణా సరకులు సహా..అన్ని నిత్యవసరాలు కార్డు ద్వారానే జరిగేలా కృషి చేస్తున్న గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్యనాయుడు ట్విట్టర్ అభినందనలకు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలుపుతూ రీ ట్విట్ చేశారు.

 Harish Rao retweeted Venkaiah Naidu's tweet on Ibrahimpur

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రోత్సాహంతో సిద్దిపేట నియోజక వర్గం మొత్తాన్ని త్వరలోనే నగదు రహిత నియోజక వర్గంగా అభివృద్ధి చేయనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు.

కాగా, కేంద్రం రూ.500, 1000 నోట్లు రద్దు చేసిన దరిమిలా నగదు కష్టాలు తీర్చే ఉద్దేశంతో ఇబ్రహీంపూర్‌ను నగదు రహితంగా మార్చేందుకు మంత్రి హరీశ్‌రావు చొరవచూపారు. ఈ విషయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి వెళ్లగా..ఆయన కూడా ఈ విషయమై రాష్ట్ర ఎంపీలను ఆరా తీశారు. ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. వివిధ అంశాల్లో ఆదర్శంగా నిలిచిన ఇబ్రహీంపూర్‌ ఈ సంవత్సరం జాతీయ సశక్తికరణ్‌ పురస్కారం కూడా అందుకుంది.

పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ కొరత ఏర్పడి, వ్యాపార కార్యకలాపాలు మందగించడంతో తెలంగాణ ప్రభుత్వం నగదు రహిత కార్యకలాపాలను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా టి- వాలెట్‌కు రూప కల్పన చేసింది. వారం రోజుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిని ఆవిష్కరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+