కవిత కు తేల్చి చెప్పిన హరీష్ - కేసీఆర్ ది ఇదే ఫైనల్ డెసిషన్..!!

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కవిత లేఖ.. తదనంతర పరిణామా లతో బీఆర్ఎస్ లో కలకలం మొదలైంది. కవిత పరోక్షంగా కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ కు తన మద్దతు ప్రకటిస్తున్నారు. కేటీఆర్ కు కాళేశ్వరం నోటీసులకు నిరసనగా ధర్నాకు కవిత నిర్ణ యించారు. ఇదే సమయంలో కవిత వరుసగా చేస్తున్న బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పైన సీనియర్ నేత హరీష్ స్పందించారు. కేసీఆర్ నిర్ణయం ఏంటో తేల్చి చెప్పారు. హరీష్ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో వైరల్ అవుతున్నాయి.

కీలక మలుపు
ఎమ్మెల్సీ కవిత వివాదం బీఆర్ఎస్ లో దుమారానికి కారణమైంది. కేసీఆర్ కు తనను దూరం చేస్తు న్నారంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. తన అన్న కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్య లు చేయటం సంచలనంగా మారింది. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ లో స్పందిస్తే సరి పోతుందా అని ప్రశ్నించారు. కొత్త పార్టీ ఆలోచన లేదని స్పష్టం చేసిన కవిత తన తండ్రిని.. ఉన్న పార్టీని కాపాడుకోవటం తన లక్ష్యమని తేల్చి చెప్పారు. తన సంస్థ జాగృతి బలో పేతం పైన ఫోకస్ చేసారు. కేటీఆర్ ను ఫిక్స్ చేసే విధంగా తన తండ్రికి కాళేశ్వరం కమీషన్ జారీ చేసిన నోటీసులకు నిరసనగా ఈ నెల 4న ధర్నాకు పిలుపునిచ్చారు. ఇక, కవిత వ్యవహారం పైన కేసీఆర్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.

harish-rao-seriously-reacts-over-kavitha-comments-on-brs-merge-with-bjp

హరీష్ క్లారిటీ
కవిత అంశం పైన ఎవరూ స్పందించ వద్దని పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కవిత టార్గెట్ చేస్తున్న వేళ కేటీఆర్ వ్యూహాత్మకంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. కవిత అంశం పైన హరీష్ తో పాటుగా కొందరు ముఖ్య నేతలతో మాత్రమే కేసీఆర్ స్పందించారు. ఇక, ఇప్పుడు హరీష్ ఇప్పటి వరకు కవిత చేస్తున్న కామెంట్స్ కు సమాధానం ఇచ్చారు. కవిత పదే పదే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం పైన స్పందించిన హరీష్ బీఆర్ఎస్ కు ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని.. కేసీఆర్ నాయకత్వంలోనే తామంతా పని చేస్తామని స్పష్టం చేసారు. ఎక్కడా కేటీఆర్ ప్రస్తావన చేయలేదు. కవిత చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదనే విధంగా హరీష్ క్లారిటీ ఇచ్చారు.

మళ్లీ అధికారంలోకి
కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేసి.. వంద సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రెడ్‌బుక్‌లో పేర్లు రాసు కుంటామని పోలీస్, ఇతర అధికారులను హెచ్చరించారు. జాగ్రత్త , రాబోయేది తమ ప్రభుత్వమే నని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది బీజేపీ నే అని హరీష్‌రావు విమర్శించారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను రూ.12 వేల కోట్లతో నిర్మిస్తున్నారని.. వీటి పనులను నలుగురు బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే ఈ ప్రాజెక్ట్‌ను ఆపాలని సవాల్ విసిరారు. బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+