మూడు కాదు.. 4 నెలలు ఉంటా - రేవంత్ కు హరీష్ కౌంటర్..!!
మూసీ పునరుజ్జీవనం పైన ముఖ్యమంత్రి రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ కౌంటర్ ఇచ్చారు. మూసీ విషయంలో రేవంత్ తమ పైన చేసిన ఆరోపణలను హరీష్ తిప్పి కొట్టారు. తన రియల్ ఎస్టేట్ కలలను గ్రాఫిక్ హంగులతో చూపించారన్నారు. రేవంత్ చూపించింది రివర్ ఫ్రంట్ అని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న వారికి మేలు జరుగుతుంది అంటే తాను వెళ్లి మూసీ బఫర్ జోన్‌లో మూడు నెలలు కాదు.. 4 నెలలు ఉంటానని హరీష్ ప్రకటించారు.
మూసీ పునరుజ్జీవనానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరుతూనే..ముఖ్యమంత్రి రేవంత్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసారు. రేవంత్ చేసిన వ్యాఖ్యల పైన హరీష్ స్పందించారు. రూ.1100 కోట్లతో ప్రాజెక్ట్ చేపట్టారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టును మార్చి రూ.4 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. మూసీలో 99 శాతం మంది సుందరీకరణ వద్దంటున్నారని చెప్పుకొచ్చారు. నల్గొండ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఎక్కువ వరదలు వస్తాయంటే మూసీకి గైడ్ వాల్ కట్టాలని హరీష్ సూచించారు. పేదల ఇండ్లకు అభ్యంతరం ఉంటే మాల్ కట్టడానికి అభ్యంతరం ఉండదా అంటూ నిలదీసారు. పేదల ఇండ్లు కూలగొట్టడానికి తాము వ్యతిరేకమన్నారు. బ్యూటిఫికేషన్ పేరుమీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని సూచించారు. మూసీ నది గర్భంలో ఉన్నవాళ్లకు 2013 పునరావాస చట్టం అమలు చేయాలని డిమాండ్ చేసారు. గచ్చిబౌలిలో 450 ఎకరాలున్నాయని.. అక్కడ ఇండ్లు ఇవ్వాలని హరీష్ డిమాండ్ చేసారు. శత్రు దేశాల మీదికి దాడికి వెళ్లినట్లు పేదల బస్తీలపై ప్రభుత్వం దాడి చేస్తున్నదంటూ హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు.












Click it and Unblock the Notifications