మోడీ మాట తప్పారు, బాబు ఇలా చేశారంటూ హరీష్ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: దేశంలో కోటి ఉద్యోగాలిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ మాట ఇచ్చారని చెప్పారని, కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పారని తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు.

రంగంలోకి హరీష్: రేవంత్‌పై కెసిఆర్ మైండ్‌గేమ్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బిజెపి శాసనసభ్యులు వాకౌట్ చేయడాన్ని హరీష్‌రావు తప్పుబట్టారు. ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ది లేదన్నారు హరీష్‌రావు.అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని మీడియాతో హరీష్‌రావు మంగళవారం నాడు చిట్ చాట్ చేశారు.

మోత్కుపల్లి: రేవంత్‌కు చెక్‌ కోసమే టిఆర్ఎస్ పొత్తు, ఒంటరి పోరేనా?

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుకు, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరిగే తీరుకు చాలా వ్యత్యాసం ఉందని హరీష్‌రావు అభిప్రాయపడ్డారు.గతంలో పాలకులు చర్చకు వెనుకంజ వేసేవారని ఆయన గుర్తు చేశారు.

కొడంగల్: ఆ రెండు పార్టీల నేతలపై టిఆర్ఎస్ వల, రేవంత్‌కు చిక్కులేనా?

మోడీ మాట తప్పారు

మోడీ మాట తప్పారు

దేశంలో కోటి ఉద్యోగాలిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు చెప్పారు.కానీ, తమ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేరుస్తున్నామని హరీష్‌రావు ప్రకటించారు.ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌, బీజేపీ వాకౌట్‌ చేయడం దారుణమన్నారు మంత్రి హరీష్‌రావు.

తెలంగాణలో లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీ

తెలంగాణలో లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీ

తెలంగాణలో లక్షా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని అన్నారు. ఇప్పటికే చాలా ఉద్యోగాలు భర్తీ చేసినట్టు చెప్పారు.పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయొద్దని చంద్రబాబు మనసులో మాట పుస్తకంలో రాశారని గుర్తు చేశారు. ఆ పార్టీ నేతలు ఇక్కడ ఉద్యోగాల గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎండిన పంటలతో ధర్నాలు

ఎండిన పంటలతో ధర్నాలు

ఉమ్మడీ ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎండిన పంట, లాంతర్లతో అసెంబ్లీకి వచ్చేవారని హరీష్‌రావు గుర్తు చేశారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. ఏదో ఒక అంశంపై సమావేశాలు వాయిదా పడిన చరిత్ర ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్దంగా ఉందన్నారు. సభను వాయిదా వేయడానికి సిద్దంగా లేమని చెప్పారు.

బిల్లులపై సమగ్రంగా చర్చలు

బిల్లులపై సమగ్రంగా చర్చలు

గతంలో బిల్లులపై చర్చలు జరిగేవి కావని, గిలెటిన్‌ అయ్యేవని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ రోజు అంశం ఆరోజే పూర్తవుతోందని, వాయిదా తీర్మానాలపై చర్చ సాధ్యం కాదని పేర్కొన్నారు. ఏ అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని హరీష్‌రావు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Irrigation Minister Harish Rao hit back at the Congress leaders in the Legislative Assembly on Tuesday for obstructing discussions.
Please Wait while comments are loading...