రేవంత్, పోలీసులకు హరీశ్ రావు హెచ్చరిక: రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఆయన అనుచరుల దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఎమ్మెల్యే ఇంటిపై జరిగిందని మండిపడ్డారు. ఈ దాడి రేవంత్ ప్రభుత్వమే చేయిచిందన్నారు. తమ పార్టీ కార్యకర్తలను గృహ నిర్బంధం, అరెస్టు చేశారన్నారు.

కానీ,పైలెట్,ఎస్కార్ట్ ఇచ్చి తమమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ వాళ్ళను దాడికి పంపారని హరీశ్ రావు మండిపడ్డారు. కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు వెళ్లిన హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఇదేం ప్రజా స్వామ్యం, ఇదేం ప్రజా పాలన? ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని నిలదీశారు. సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. ఖమ్మంలో వరద భాధితుల పరామర్శకు వెళ్తే మాపై దాడి చేశారు అని మండిపడ్డారు.

Harish Rao s warning to Revanth reddy police A direct question to Rahul Gandhi

నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పింది గాంధీ కాదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడమే కాకుండా.. వారిని ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తున్నామన్నారు.

మా ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేసి, పోలీసులు ఏం చేస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిపై దాడి రేవంత్ రెడ్డి చేయించారని ఆరోపించారు. ఏసీపీ, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కాపాడారు. పెట్టుబడులు స్వర్గధామంగా హైదరాబాద్‌ను కేసీఆర్ చేశారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుపుతప్పాయి. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బ తింటుంది. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో తొమ్మిది కమ్యూనల్ ఘటనలు చోటుచేసుకున్నాయి. తొమ్మిది నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రతిష్టపాలైందన్నారు.

మా సహనాన్ని చేతగానితనంగా భావించవద్దంటూ హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమకు తెలంగాణ ప్రజలు,హైదరాబాద్ ముఖ్యమని అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో స్పీకర్ స్పందించాలి. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడిని అడ్డుకోని పోలీసులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలుంటాయని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు.

మాటల్లో ప్రజా పాలన...రాహుల్ గాంధీ చేతుల్లో రాజ్యాంగం. కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా రాహుల్ గాంధీ? అని హరీశ్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ మందలిస్తారా లేదా చెప్పాలన్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దోపిడీ,మోసాలు, ఆరు గ్యారెంటీల గారడీని దేశంలోని ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పర్యటించి వివరిస్తామని హరీశ్ రావు చెప్పారు. సైబారాబాద్ సీపీకి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేస్తారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+