ఈ ఏడాది 7.91 కోట్ల మొక్కలు నాటాం, మరో కోటి టార్గెట్, ఆగస్టుతో హరిత హారం పూర్తి: ఎర్రబెల్లి
ఆకుపచ్చ తెలంగాణే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఈ ఏడాది కూడా సూపర్ సక్సెస్ అయిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు వివరిస్తూ..
రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ 8,76,30,000(8.76కోట్ల) మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే, ఇప్పటి వరకు 7,91,2,000(7.91 కోట్ల) మొక్కలు నాటామని మంత్రి దయాకర్ చెప్పారు. టార్గెట్ లో మిగిలిన మొక్కలను నాటే ప్రక్రియ ఆగస్టు నెలాఖరు లోగా పూర్తి చేస్తామని అయన తెలిపారు.

మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం నాడు నల్గొండ జిల్లాలోని మునుగోడు గ్రామం వద్ద హైవే రోడ్డు పక్కన మొక్కలు నాటుతున్న ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ కింద రాష్ట్రంలో 6 వేల 437 కి.మీ పొడవైన రోడ్ల కిరువైపున ప్లాంటేషన్ ను చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 3 వేల 208 కి.మీ పొడవైన ప్లాంటేషన్ ను పూర్తి చేశామని, మిగతా 3 వేల 155 కి.మీ పొడవైన అవెన్యూ ప్లాంటేషన్ ను వెంటనే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
రోడ్డుకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ వెంటనే పూర్తి చేయాలని, నాటిన ప్రతి మొక్క సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి గ్రామ పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. నాటిన మొక్కలు వాడిపోకుండా ఎప్పటికప్పుడు వాటరింగ్ చేయాలని సూచించారు. మేకలు, ఇతర జంతువుల నుంచి మొక్కలను రక్షించడానికి మొక్కలు నాటిన వెంటనే ట్రీగార్డులు అమర్చాలని మంత్రి ఆదేశించారు. ఇదిలా ఉంటే,
హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 73,918 సీడ్ బాల్స్‌తో అతిపెద్ద సీడ్‌బాల్ సెంటెన్స్‌గా గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది. గిన్నీస్ రికార్డు వరించినందుకు మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం పాలమూరు మహిళా సమాఖ్య కృషిని సిఎం కెసిఆర్ అభినందించారు. పది రోజులలో పాలమూరు మహిళా సంఘాల సభ్యులు 2.08 కోట్ల విత్తన బంతులను వెదజల్లి రికార్డు సృష్టించారు. మహిళా సంఘాల సభ్యులు గత సంవత్సరం 1.18 కోట్ల విత్తన బంతులు వెదజల్లారు. ఇక,
తెలంగాణలో బొగ్గుగనుల సంస్థ సింగరేణిలో పెద్ద ఎత్తున హరి తహరం కార్యక్రమం చేపట్టినట్లు సింగరేణి డైరెక్టర్‌ఫా, పీఅండ్ పీ ఎన్.బలరాం తెలిపారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం సూచనలతో సింగరేణి వ్యాపితంగా వృక్షారోవన్‌అభియాన్‌తో మొక్కలను కోట్లాదిగా నాటిస్తున్నట్లు ప్రకటించారు. సింగరేణి అన్ని డివిజన్‌లలో ఈ కార్యక్రమం ఎంతోవైభవంగా చేపట్టినట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం సింగరేణి చేస్తున్న కృషిలో భాగంగా హరితహరం చేపట్టినట్లు పేర్కొన్నారు. అసలు..
సీఎం కేసీఆర్ స్పష్టమైన లక్ష్యాలతో హరిత హారాన్ని ప్రారంభించారు. తెలంగాణ భూభాగం 1,12,101 చదరపు కిలోమీటర్లు ఉండగా అడవులు 26,903.70 చకిమీ మేర (24శాతం) ఉన్నాయి. హరితహారం ద్వారా అటవీ ప్రాంతాన్ని 33శాతానికి పెరిగేలా చేయడం, తద్వారా వానలు వాపస్ వచ్చేలా చూడటం. అడవిలో, రోడ్లకిరువైపులా పండ్ల చెట్లను నాటటంద్వారా నివాసాలు, పంటపొలాలపై దాడిచేస్తున్న కోతులకు ప్రత్యామ్నాయం చూపటం. వాతావరణంలో ప్రాణవాయువును పెంచటం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం లాంటివి హరితహారం లక్ష్యాలు. దీనికోసం నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటి సంరక్షించాలని కేసీఆర్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అటవీ ప్రాంతంలో 100కోట్ల మొక్కలు, అటవీ ప్రాంతం వెలుపల 120 కోట్ల మొక్కలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 10కోట్ల మొక్కలు పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications