హరిత తెలంగాణా లక్ష్యంగా హరితనిధి: ప్రతి రిజిస్ట్రేషన్ కు రుసుం వసూలుచేస్తున్న కేసీఆర్ సర్కార్!!
వృక్షో రక్షతి రక్షితః అంటారు. అటువంటి వృక్షాలను మనం కాపాడితే, అవి మనల్ని కాపాడతాయి. మన భావి తరాలను రక్షిస్తాయి. అంతేకాదు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరగడమే కాకుండా, మానవ మనుగడ ప్రమాదంలో పడకుండా ఉంటుంది. భావితరాలకు బంగారు భవిష్యత్తును కానుకగా ఇచ్చినట్టు ఉంటుంది.
ఇక ఇదే ఉద్దేశంతో తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను చేపట్టి, ఈ బాధ్యతలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్ర పౌరులలో భాగస్వామ్య భావాన్ని తీసుకురావడం కోసం హరిత నిధిని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణా హరిత నిధి.. అందరి భాగస్వామ్యం కోసం తెలంగాణా సర్కార్ నిర్ణయం
తెలంగాణా హరిత నిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జీతాల నుంచి నెలకు 500 రూపాయలు, అలాగే సివిల్ సర్వెంట్ల జీతాల నుంచి వంద రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ నెలకి 25 రూపాయలు వేతనాల్లో కోత విధించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ప్రజలు కూడా భాగస్వామ్యం చేయడానికి ఆస్తి మరియు వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో గ్రీన్ ఫండ్ వసూలు చేయాలని నిర్ణయించింది.

ప్రతి రిజిస్ట్రేషన్ కు 50 రూపాయలు.. హరిత నిధి వసూలు చేస్తున్న అధికారులు
ఈ మేరకు రాష్ట్రంలో జరిగే భూముల రిజిస్ట్రేషన్ లకు హరిత నిధి వసూలు చేయడానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రతి రిజిస్ట్రేషన్ కు 50 రూపాయల చొప్పున తెలంగాణ హరిత నిధిని అధికారులు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సందర్భంగా ఈ మొత్తాన్ని ఈ స్టాంపుల రూపంలో వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు. రిజిస్ట్రేషన్ సమయంలో హరిత నిధిని వసూలు చేయడం కోసం చర్యలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజి కి సి ఎస్ సోమేశ్ కుమార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

హరితహారం సమర్ధంగా అమలు కోసమే హరిత నిధి
తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం హరిత నిధిని ప్రారంభించింది. ఈ మేరకు గతంలోని రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర పౌరుల్లో భాగస్వామ్య భావాన్ని తీసుకురావడమే హరిత నిధి లక్ష్యం అని పేర్కొన్న ముఖ్యమంత్రి హరిత నిధి ద్వారా మొక్కలను పెంచడంలో ప్రజలందరి భాగస్వామ్యాన్ని తీసుకురానున్నారు.

విద్యార్థులు అడ్మిషన్ ల సమయంలోనూ హరిత నిధికి ఫండ్
అంతేకాదు విద్యార్థులను కూడా హరిత నిధిలో భాగస్వామ్యం చేయాలని భావించిన కేసీఆర్ స్కూల్ అడ్మిషన్ల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 వసూలు చేయాలని ప్రతిపాదించారు. హరిత నిధి కోసం స్వచ్ఛంద సంస్థలు మరియు వ్యక్తుల నుండి కూడా విరాళాలు తీసుకుంటామని వెల్లడించారు. హరిత నిధిని రూపొందించడానికి అవసరమైన విధానాలను రూపొందించిన ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తోంది.

రాష్ట్రంలో సుమారు 237.42 కోట్ల మొక్కలు, పరిరక్షణే ధ్యేయంగా హరితనిధి
అడవుల పునరుద్ధరణ, కొత్త మొక్కలు, ఎవెన్యూ, బహుళ మొక్కల పెంపకం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2015లో తెలంగాణకు హరితహారాన్ని ప్రారంభించింది. 2015 నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 237.42 కోట్ల మొక్కలు నాటారు, దీని వ్యయం రూ.6,556 కోట్లు. ఇంత ఖర్చు పెట్టి హరితహారం కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం ఈ మొక్కలను సంరక్షించడం కోసం హరిత నిధిని సేకరిస్తుంది. అందులో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications