ఉద్యమకారుడు కావలి శివశంకర్ ఫ్యామిలీకి హరీశ్ భరోసా
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి, ఇటీవల గుండెపోటుతో మరణించిన ఉద్యమకారుడు కావలి శివశంకర్ కుటుంబానికి మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు బాసటగా నిలిచారు.
శివశంకర్ భార్య పార్వతమ్మకు మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం కల్పించారు. ఈ సందర్భంగా పార్వతమ్మ.. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన శివశంకర్ మార్చి 18న గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో శంకర్ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తరపున బుధవారం హైదరాబాద్‌లో పార్వతమ్మకు నియామకపత్రం అందజేశారు హరీశ్ రావు.












Click it and Unblock the Notifications