షాక్- స్మిత సబర్వాల్‌‌ను విచారించిన పోలీసులు

Smita Sabharwal IAS: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చెట్ల నరికివేత వ్యవహారం మరో మలుపు తిరిగింది. చెట్ల నరికివేత, జంగిల్ క్లియరెన్స్ అంశంపై ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ ఫొటోలను షేర్ చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అటవీ భూమిలో కొద్దిరోజుల కిందట ప్రభుత్వం చేపట్టిన చెట్ల నరికివేత వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నరికివేత వల్ల అక్కడ తలదాచుకుంటోన్న వణ్యప్రాణులు, పక్షులు ఆశ్రయాన్ని కోల్పోయాయంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Have fully cooperated with Gachibowli police authorities says Smita Sabharwal

హెచ్‌సీయూ విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. తరగతులను బహిష్కరించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. కొన్ని రోజుల పాటు వారి ఆందోళన కొనసాగింది. అదే సమయంలో జింకలు, దుప్పులు, నెమళ్లు ఆశ్రయం కోల్పోయి.. జనావాసాల్లోకి వస్తోన్నాయంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయ.

దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల స్థలంలో ఐటీ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ చర్యకు ఆటంకం కలిగిస్తోన్నట్లు అభిప్రాయపడ్డారు.

దీనిపై వస్తోన్న తప్పుడు కథనాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేయాలంటూ రేవంత్ రెడ్డి- అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీనితో ప్రభుత్వం చట్టపరంగా చర్యలకు సిద్ధపడింది. చెట్ల నరికివేత, వణ్యప్రాణులు ఆశ్రయం కోల్పోయాయంటూ ఏఐ జనరేటెడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

ఈ ఫొటోలను షేర్ చేసిన కేసులో విచారణను ఎదుర్కొంటోన్నారు సీనియర్ ఐఎఎస్ అధికారిణి, పర్యాటక మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్. ఇందులో భాగంగా ఆమెను గచ్చిబౌలి పోలీసులు ఆమెకు ఇదివరకే భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 179 కింద నోటీసు జారీ చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన ఘిబ్లి ఫొటోను ఆమె రీట్వీట్ చేశారు.

ఈ కేసులో నేడు స్మిత సబర్వాల్ విచారణకు హాజరయ్యారు. ఇది ముగిసిన అనంతరం కొంత సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. గచ్చిబౌలి పోలీసు అధికారులకు తాను పూర్తిగా సహకరించానని వెల్లడించారు. బీఎన్‌ఎస్‌ఎస్ చట్టం ప్రకారం చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తన వాంగ్మూలాన్ని ఇచ్చానని చెప్పారు.

కంచ గచ్చిబౌలి అంశంపై పోస్ట్‌ను 2,000 మంది సోషల్ మీడియా యూజర్లు రీ-షేర్ చేశారని స్మిత సబర్వాల్ గుర్తు చేశారు. వాళ్లందరిపైనా ఒకేరకమైన చర్య తీసుకుంటారా? లేదా అనే విషయంపై స్పష్టత కోరానని చెప్పారు. అలా కాకుండా- ఎంపిక చేసుకున్న వాళ్లను కొంతమందిని మాత్రమే విచారణకు పిలవడం అనేది ఆందోళనకరమని, చట్టం ముందు అందరూ సమానమేనే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+