వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి 'హజ్మత్': కెమికల్ దాడులను తిప్పికొట్టే ప్లాన్, ఇవాంకా ట్రంప్‌ రక్షణ కోసమే

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నవంబర్ 28వ,తేదిన హైద్రాబాద్‌లో జరిగే జీఈఎస్ 2017 సదస్సులో పాల్గొనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రక్షణ కోసం అమెరికా అధికారులతో పాటు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదకర బ్యాక్టీరియ, వైరస్‌, విష రసాయన పదార్థాలను నిర్మూలించే అత్యాధునిక వాహనాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించనుంది. రూ. 5 కోట్లతో కొనుగోలు చేసిన హజ్మత్ వాహనాన్ని తొలిసారిగా ఇవాంకా ట్రంప్ రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించనుంది.

ఇవాంకా ట్రంప్‌కు పోచంపల్లి చీరెలు, మోడీకి కుర్తా, ఫైజామా: కెసిఆర్ సర్కార్ గిఫ్ట్ఇవాంకా ట్రంప్‌కు పోచంపల్లి చీరెలు, మోడీకి కుర్తా, ఫైజామా: కెసిఆర్ సర్కార్ గిఫ్ట్

అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1600 మంది ప్రతినిధులు పాల్గొంటారు.

ఇవాంకా ట్రంప్‌కు పోచంపల్లి చీరెలు, మోడీకి కుర్తా, ఫైజామా: కెసిఆర్ సర్కార్ గిఫ్ట్ఇవాంకా ట్రంప్‌కు పోచంపల్లి చీరెలు, మోడీకి కుర్తా, ఫైజామా: కెసిఆర్ సర్కార్ గిఫ్ట్

ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా విఐపీలు, ప్రముఖులు హజరుకానున్న నేపథ్యంలో భద్రతపరంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకొంటుంది. ఇవాంకా ట్రంప్ రక్షణ కోసం అమెరికా భద్రతాధికారులు రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ పోలీసులకు అమెరికా అధికారులు తగు సూచనలిస్తున్నారు.

 ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్‌లు నిర్మూలించే హజ్మత్

ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్‌లు నిర్మూలించే హజ్మత్

జీఈఎస్ 2017 సదస్సులో పాల్గొనే ప్రతినిధులను హని కల్గించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే... వెంటనే ఆ చర్యలను తిప్పికొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటుంది. ప్రమాదకర బ్యాక్టీరియా, వైర్‌సలు, విష, రసాయన పదార్థాలను ఉద్దేశపూర్వకంగా శరీరంలో ఎక్కించుకుని ఎవరైనా జీఈఎస్‌ సభా ప్రాంగణంలోకి ప్రవేశిస్తే అత్యాధునిక పరికరాలతో పోలీసులు వాటిని క్షణాల్లో గుర్తించి వెంటనే వాటిని నిర్వీర్యం చేయనున్నారు.తెలంగాణ అగ్నిమాపక దళంలోని అత్యాధునిక వాహనం ‘హజ్మత్‌'ద్వారా ఈ రకమైన ప్రమాదం నుండి రక్షించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు.

తొలిసారిగా హజ్మత్ వాహనం

తొలిసారిగా హజ్మత్ వాహనం

నవంబర్ 28న హెచ్‌ఐసీసీలో ప్రారంభంకానున్న గ్లోబల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌) భద్రతలో హజ్మత్ అనే వాహనమే విఐపిల రక్షణలో కీలకంగా మారనుంది. హజ్మత్‌ను ఉమ్మడి రాష్ట్రంలోని ఫైర్‌ విభాగం 2009లో కొనుగులు చేసింది. దీని ధర రూ.5 కోట్లు. దేశంలోనే మొదట హజ్మత్‌ను కొనుగోలు చేసిన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. జీఈఎస్‌ సందర్భంగా తొలిసారి హజ్మత్‌ను ఉపయోగించనున్నారు..

ఈ వాహనం ఇలా పనిచేస్తోంది

ఈ వాహనం ఇలా పనిచేస్తోంది

హజ్మత్ వాహనం ప్రమాదకరమైన బ్యాక్టీరీయా, వైరస్‌లను నిర్మూలించనుంది.ఇందులో కెమికల్‌, బయోలాజికల్‌, రేడియో యాక్టివ్‌, న్యూక్లియర్‌ (సీబీఆర్‌ఎన్‌) విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి నలుగురు సిబ్బంది పనిచేస్తారు. ఆయా రంగాల్లో వారు నిష్ణాతులు. ఘటన తీవ్రతను గుర్తించి వారంతా రంగంలోకి దిగుతారు. హజ్మత్‌లో ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ లు, విష, రసాయన పదార్థాలను నిర్వీర్యం చేయడానికి అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంటాయి.

ప్రత్యేక దుస్తులు, కిట్‌లు

ప్రత్యేక దుస్తులు, కిట్‌లు

ప్రమాదం జరిగితే రెస్క్యూ చేయడానికి సిబ్బందికి ప్రత్యేక దుస్తులు, బాధితులు సులువుగా శ్వాస తీసుకోవడానికి ప్రత్యేక కిట్‌ ఉంటుంది. బాధితులు తేరుకోవడానికి ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేసి చికిత్స అందజేస్తారు. కెమికల్‌, బయోలాజికల్‌, రేడియో యాక్టివ్‌, న్యూక్లియర్‌ (సీబీఆర్‌ఎన్‌) దాడులను తిప్పికొట్టడం.. వాటి వల్ల ప్రమాదాలు జరిగితే రెస్క్యూ ఆపరేషన్‌ చేయడానికి హజ్మత్‌ ఉపయోగపడుతుంది. ఇందులో 32 మంది రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు.

English summary
Telangana government will using 'Hazmat' vehicle for Ivanka trump protection.This vehicle fighting against chemical attacks.first time Telangana government use this vehicle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X