వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరెస్ట్ ఇష్యూ: ఆధారాల్లేవంటూ పిటిషన్ కొట్టివేత, రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ షాక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లోకసభ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో సోమవారం షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి, విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లింది.

<strong>రిలీజ్ చేశాం: ఏజీ, హైకోర్టు ప్రశ్నల వర్షం, 'రేవంత్ ఓ బ్రహ్మోస్ మిసైల్.. తెరాస కథను ముగిస్తాడు' </strong>రిలీజ్ చేశాం: ఏజీ, హైకోర్టు ప్రశ్నల వర్షం, 'రేవంత్ ఓ బ్రహ్మోస్ మిసైల్.. తెరాస కథను ముగిస్తాడు'

 కారణాలు చూపలేదని పిటిషన్ కొట్టివేత

కారణాలు చూపలేదని పిటిషన్ కొట్టివేత

ఈ కేసు విచారణ హైకోర్టులో జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొడంగల్‌లో రేవంత్ రెడ్డి అరెస్టును సవాల్ చేస్తూ వేసిన ఈ పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రేవంత్‌ది అక్రమ అరెస్టు అని చెప్పేందుకు తగిన కారణాలు చూపలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషన్ కొట్టివేసినట్లు చెప్పింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇది రేవంత్‌కు ఇది మరో షాక్.

 హెబియస్ కార్పస్ పిటిషన్

హెబియస్ కార్పస్ పిటిషన్

అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అర్ధరాత్రి రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ మేరకు విచారణ జరిపిన జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ఈ పిటిషన్ పైన గత నెల విచారణ జరిగింది. రేవంత్ రెడ్డిని పోలీసులు అదే రోజు విడిచిపెట్టారని, దీనిపై విచారణ అవసరం లేదని ఏజీ చెప్పారు. కానీ రేవంత్ తరఫు లాయర్ మాత్రం ఒక్క రూపాయి అయినా పరిహారం ఇవ్వాలన్నారు. ఈ కేసుపై గత ఏడాది డిసెంబర్ 4, ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 25వ తేదీన ఇలా పలుమార్లు విచారణ జరిగింది.

 బంద్‌కు పిలుపునిచ్చి అరెస్ట్ అయ్యారు

బంద్‌కు పిలుపునిచ్చి అరెస్ట్ అయ్యారు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొడంగల్‌లో సీఎం కేసీఆర్ సభను రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో అతనిని అరెస్ట్ చేశారు. దీనిపై వేం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అక్రమ అరెస్ట్ అని చెప్పేందుకు ఆధారాలు లేవని, చెబుతూ పిటిషన్ కొట్టివేసింది.

English summary
High Court quashed Congress leader Vem Narender Reddy petition against Congress working president Revanth Reddy's arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X