మహిళతో రాసలీలలు: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన హెడ్ కానిస్టేబుల్
హైదరాబాద్: ఓ మహిళతో రాసలీలలు నడుపుతూ భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఉదంతం హైదరాబాదులోని ఛత్రినాక పోలీస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఛత్రినాక పోలీస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మధుసూధన్‌రెడ్డి(45)కి స్థానికంగా ఉండే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది.
ఈ క్రమంలో మధుసూదన్‌రెడ్డి ఉప్పుగూడ సాయిబాబానగర్‌లో ఓ ఇంట్లో ఆ మహిళతో కలిసి ఉండగా గమనించిన స్థానికులు ఇంటి తలుపు గడియపెట్టి స్థానికులకు సమాచారం అందించాంది. స్థానికులు పెద్దసంఖ్యలో పోగై ఛత్రినాక పోలీస్టేషన్‌కు మధుసూదన్‌రెడ్డిని అప్పగించారు. ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్‌పై ఐపిసి 497 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఛత్రినాక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
సంఘటనపై హైదరాబాదు పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశించారు. రాత్రి పది గంటల ప్రాంతంలో మధుసూదన్ రెడ్డి మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమె ఇది వరకు గృహ హింస కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెడ్ కానిస్టేబుల్ మహిళతో ఇంట్లో ఉండగా మహిళ భర్త కూడా వచ్చినట్లు చెబుతున్నారు. భర్త, స్థానికులతో కలిసి అతన్ని పట్టుకునున్నట్లు తెలిపారు.

మధుసూదన్ రెడ్డిపై మహిళ భర్త చెన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, తన భర్త చెన్నయ్యపై మహిళ ఎదురు ఫిర్యాదు చేసింది. వారిద్దరిని కావాలని ఇంటి లోపల వేసి తలుపులు పెట్టారని స్థానిక నాయకుడొకతను అంటున్నారు.
మహిళ గృహ హింస కింద అప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిందితులకు నోటిసులు ఇవ్వడానికి మధుసూదన్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్తూ ఉండేవాడని చెప్పారు. శనివారం రాత్రి మహిళ సాయం కోసం మధుసూదన్ రెడ్డిని పిలిచిందని చెబుతున్నారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ?












Click it and Unblock the Notifications