Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్‌తో లింక్ లేదు: అల్లం నారాయణ

హైదరాబాద్: జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలనే తెలంగాణ ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చబోతోంది.జర్నలిస్టులు ఏడాదికాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత వైద్య చికిత్సా విధానానికి ఆమోదం తెలిపారు. జర్నలిస్టులకు అవసరమైన వైద్య చికిత్సల ఖర్చులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు వస్తాయని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. జర్నలిస్టుల హెల్క్ కార్డుల పథకం వివరాలను ఆయన మీడియాకు అందించారు.

జర్నలిస్టుల నుంచి పైసా కూడా వసూలు చేయకుండా పూర్తిస్థాయిలో వైద్య చికిత్స పొందే అవకాశాన్ని కల్పించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు అనుసరిస్తున్న హెల్త్‌కేర్ విధానంలోనే జర్నలిస్టులకూ నగదు రహిత వైద్య చికిత్స విధానం అమలులోకి రానుంది. ఈ విధానం అమలుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ప్రతి ఆరు నెలలకోసారి ఈ పథకంపై సమీక్ష జరుపనుంది. ఈ మేరకు జర్నలిస్టుల నగదు రహిత వైద్య చికిత్స పథకానికి మార్గదర్శకాలు పేర్కొంటూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది.

Health cards to journalists: Allam Narayana thanks

దీనిప్రకారం గతంలో వర్తింపజేసిన గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ విధానంలోనే జర్నలిస్టుల కుటుంబసభ్యులందరికీ నగదు రహిత చికిత్స లభించనుంది. వర్కింగ్, రిటైర్డ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం అనే పేరుతో ఈ పథకాన్ని వ్యవహరిస్తారు. సమాచార, పౌర సంబంధాల కమిషనర్ ద్వారా గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ ఈ స్కీంను వర్తింపజేస్తారని మార్గదర్శకాలలో పేర్కొన్నారు.

జర్నలిస్టుల తల్లిదండ్రులకు, భార్యా పిల్లలకు, నగదు రహిత చికిత్సా విధానం వర్తిస్తుందని తెలిపారు. ఉద్యోగంలేని కూతురు, 25ఏండ్ల వయస్సు వరకు కుమారులకు ఇది వర్తిస్తుంది. అయితే తెల్లరేషన్‌కార్డు కలిగిన జర్నలిస్టులు ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీం, వర్కింగ్-రిటైర్డ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీంలలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవాలి. రెండింటినీ ఎంపిక చేసుకోకూడదని మార్గదర్శకాలలో స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టులో ఉన్న దవాఖానాలన్నింటిలో జర్నలిస్టులకు నగదు రహిత వైద్యచికిత్స లభిస్తుంది.

ఇప్పటికే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ హెల్త్‌కార్డ్ ట్రస్టులో ఉన్న దవాఖానల జాబితాను వెలువరించింది. ఆస్పత్ర్లుల్లో ఇన్‌పేషెంట్‌గా చేరే జర్నలిస్టులకు, అవసరమైతే వారికి ఆపరేషన్లకు ఈ స్కీం వర్తిస్తుంది. వైద్యచికిత్సల అనంతరం దవాఖాన నుంచి ఇంటికి వెళ్లే సందర్భంలో పదిరోజులకు కావాల్సిన మందులను కూడా ఉచితంగా ఇస్తారు.

Health cards to journalists: Allam Narayana thanks

ఈ మొత్తానికీ సీలింగ్ లేకుండా వైద్యఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్ర్లుల్లో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టులో ఉన్న దవాఖానలన్నింటిలో వర్కింగ్ జర్నలిస్టులకు, రిటైర్డ్ జర్నలిస్టులకు వైద్యసదుపాయాలు లభిస్తాయి. ఈ స్కీంకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు పర్యవేక్షించనుంది. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.

ఆరోగ్యశ్రీ ట్రస్టులో ఫిర్యాదులు స్వీకరించేందుకు, జర్నలిస్టులకు ఏవైనా అన్యాయాలు జరిగితే సవరించేందుకు ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనరేట్ జర్నలిస్టులకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టుకు అందజేయనున్నది. జర్నలిస్టులు హెల్త్‌కేర్ ట్రస్టు వెబ్‌సైట్ ద్వారా తమ హెల్త్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మార్గదర్శకాలలో చెప్పారు.

సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయం ..ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

జర్నలిస్టులకు నగదు రహిత వైద్యచికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెల్త్‌కార్డుల జారీ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టులకు ఇంత చక్కటి సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని, అది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనత అని అన్నారు. సీఎం కేసీఆర్‌కే ఈ ఘనత దక్కుతుందని సచివాలయంలోని మీడియా వద్ద విలేకరులతో అన్నారు.

ఆన్‌లైన్ మీడియాను గుర్తించినందుకు కృతజ్ఞతలు

దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్ మీడియాను గుర్తించిన ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని తెలంగాణ ఆన్‌లైన్ జర్నలిస్ట్ యూనియన్ (తోజు) అధ్యక్షుడు కాసుల ప్రతాప్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ధర్మాసనం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+