విచారణ వాయిదా: ఈ నెల 24వరకు జైల్లోనే రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు పట్టుబడిన తెలగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఈ నెల 24వ తేదీ వరకు జైలులోనే ఉండాల్సి వస్తోంది. రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది.

కాగా, కౌంటర్ దాఖలు చేయాలని ఎసిబిని హైకోర్టు ఆదేశించింది. ఇటీవలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి అపాయింటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ముడుపులు ఇచ్చిన కేసులో ఏసీబీ అధికారులు రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసి చర్లపల్లి జైలుకు పంపించిన విషయం తెలిసిందే.

Hearing on Revanth Reddy's bail petition adjourned

ఈమేరకు రేవంత్‌రెడ్డి తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎసిబి కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేసేందుకు ఎసిబి సిద్ధమవుతోంది.

నోటుకు ఓటు కేసులో మరో ఇద్దరు నిందితులు ఉదయ సింహ, సెబాస్టియన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై వాదనను కూడా హైకోర్టు ఈ నెల 24వ తేదీకు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+