మంచు దుప్పట్లో హైదరాబాద్.. అరకు, ఊటీ, కాశ్మీర్ లానే !!
హైదరాబాద్ మంచు దుప్పటి కప్పేసిందా.. భాగ్యనగరం మరో ఊటీ, అరకు, కాశ్మీర్ లాగా మారుతుందా అని అనిపిస్తుంది. అందుకు ప్రధాన కారణం నగర్ శివారు ప్రాంతాలను ఈరోజు (జనవరి 2, 2025) ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ మంచు వల్ల తెల్లవారుజాము నుంచే పరిసరాలన్నీ కాశ్మీర్ లోయను తలపించాయి. రోడ్లు, చెట్లు, భవనాలు సైతం మంచు వల్ల కనుమరుగయ్యాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.
మరీ ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం-నాగార్జునసాగర్ హైవే, శామీర్‌పేట్, మేడ్చల్, షామ్షాబాద్, ఆదిబట్ల, గండిపేట, కొంపల్లి, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్ ప్రాంతాలపై పొగమంచు ఎక్కువగా ఉంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్డు, ఔటర్ రింగు రోడ్డు (ORR), వికారాబాద్ జాతీయ రహదారులు సైతం దట్టమైన మంచుతో కప్పబడ్డాయి. ముందు వెళ్లే వాహనాలు కనిపించకపోవడంతో ట్రాఫిక్ ముందుకు కదలడానికి తీవ్ర జాప్యం అవుతోంది. ఫాగ్ లైట్లు వేసినా రహదారి స్పష్టంగా కనిపించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

తెల్లవారుజాము నుండి 9 గంటలైనా పొగ మంచి వీడకపోవడం సూర్యుడు చంద్రుడిలా కనిపించడం చూపరులకు వింతగా అనిపిస్తుంది. ఆర్‌సీపురం నుండి పటాన్‌చెరు మీదుగా ఇస్నాపూర్, రుద్రారం, ముత్తంగి, ఇంద్రేశం వరకు రోడ్డు అంతా దట్టమైన మంచుతో కప్పేసింది. మరోవైపు ఇబ్రహీంపట్నం హైవే వంటి ప్రధాన రహదారులపై ఉదయం 8 గంటలు దాటినా పది అడుగుల దూరంలోని వాహనాలు కనిపించలేదు. సంగారెడ్డి జిల్లాలోని ముంబై జాతీయ రహదారిలోనూ పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంది.
ఓ వైపు పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్థులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ అహ్లాదకరమైన ఈ చల్లదనాన్ని మార్నింగ్ వాకర్స్ మాత్రం బాగా ఆస్వాదించారు. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలోనూ పొగమంచు కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీ నుంచి శంషాబాద్‌కు, శంషాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దయింది. శంషాబాద్-తిరుపతి, తిరుపతి-శంషాబాద్ ఇండిగో విమానం కూడా ఆలస్యంగా నడుస్తోంది.
ఇక అవసరమైతేనే రోడ్డు పైకి రావాలని.. పొగ మంచు కారణాల వల్ల ముందు వెళ్తున్న వాహనాలు కనిపించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. వాహనాలు నడిపే వారు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో వేగంగా వెళ్లడం కన్నా జాగ్రత్తగా వెళ్లడం అత్యంత ముఖ్యమైన విషయమని స్పష్టం చేస్తున్నారు.
నగర శివారైన శంషాబాద్ పరిధిలోని పాలమాకుల్, ఎయిర్‌పోర్టు, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, గండిపేట్ తదితర ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. రహదారులు స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. బెంగళూరు జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్… pic.twitter.com/jJQ2SKcMSH
— oneindiatelugu (@oneindiatelugu) January 2, 2026
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తెలంగాణ డిస్కంలకు సింగరేణి ఊహించని షాక్.. రాజస్థాన్ కు కరెంట్ విక్రయం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications