హైదరాబాదులో కుండపోత: పివి ఎక్స్‌ప్రెస్ హైవేపై చీకటి, ఢీకొన్న కార్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో హైదరాబాదులో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ట ట్రాఫిక్ నిలిచిపోయింది. పివి ఎక్స్‌ప్రెస్ హైవేపై సాయంత్రం చిమ్మ చీకటి అలుముకుంది. దీంతో దారి కనిపించక వాహనాలు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. అధికారులు సహాయక చర్యలకు దిగారు.

మంగళవారం మధ్యాహ్నం హైదరాబాదులోని పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట, ఖైరతాబాదు, వనస్థలిపురం, హయత్‌నగర్, నారాయణగుడా, కాచిగుడా, మల్కాజిగిరి, కుషాయిగుడా తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు నిలిచాయి. దీంతో వాహనాలు అక్కడక్కడ నిలిచిపోయాయి.

Rain in Hyderabad

బిఎన్ రెడ్డి నగర్, నాగోల్, కుషాయిగుడా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడ్డాయి.

హైదరాబాదులో సోమవారం కూడా భారీ వర్షాలు పడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వర్షం పడిన ప్రతిసారీ హైదరాబాదులో ట్రాఫిక్ కష్టాలు తప్పని పరిస్థితులే ఉన్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Traffic halted in various places of Hyderabad due to heavy rains. Cars collided on PV express high way due to darkness.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి