తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక: హైదరాబాద్‌లో భారీ వర్షం, ఈదురుగాలుల బీభత్సం
హైదరాబాద్: తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడిపోతున్న హైదరాబాద్ నగర ప్రజలపై వరుణుడు కరుణ చూపాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్మేశాయి. ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరం చల్లబడటంతో సిటీ వాసులకు తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభించినట్లయింది.
హైదరాబాద్ నగరంలోని కుత్భూల్లాపూర్, మియాపూర్, చందానగర్, కూకట్‌పల్లి, నిజాంపేట్, తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిశాయి. సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, బషీరాబాద్ తోపాటు తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఊదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది.

హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు జిల్లలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుముమెరులతో కూడిన భారీ వర్షం పడింది. మానుకొండూర్, హుజూరాబాద్, పెద్దపల్లి, మల్యాల, వేములవాడ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షా కురిసింది.
సీఎం రేవంత్ సభ రద్దు
సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్ జనజాతర సభ కోసం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన టెంట్ల కుప్పకూలాయి. ఈదురుగాలుల ధాటికి కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. ఆ సమయంలో టెంట్ల కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షం, ఈదురుగాలల బీభత్సంతో సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
భారీ వర్షాలు: తెలంగాణ ప్రజలకు ఐఎండీ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50కిలో మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. రాగల రెండు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
సోమవారం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి/గాలి విచ్చిన్నతి కొనసాగింది. మంగళవారం కూడా తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
విస్తరించిన ఉపరితల ఆవర్తనం- ఏపీలో 15 జిల్లాల్లో వర్షాలు -
బంగాళాఖాతంపై మరింత విస్తరించిన ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications