Telangana Rains: ఆ జిల్లాల్లో కుంభ వృష్టి..!
తెలంగాణలో భారీ వర్షలు కురుస్తోన్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కుండపోత వానలు పడుతున్నాయి. మరి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కుంభ వృష్టి నమోదు అయింది. గడిచిన 48 గంటల్లో అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ 290 మి.మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇదే జిల్లా చిలుకూరులో 280 మి.మీ, ఖమ్మం జిల్లాలోని ఎర్రపాలెంలో 210 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వాయుగుండం ప్రభావంతో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ప్రభావంతో ఆది, సోమవారాల్లోనూ అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. భారీ వర్షాలతో పలు చోట్ల రైల్టే ట్రాక్ లు కొట్టుకుపోయాయి. ఆది, సోమవారాల్లో రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

ఈ జిల్లాల్లో 15 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసుంది. ఈ జిల్లాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇక నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట,రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలు నేపథ్యంలో ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వస్తోంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్ భారీ ప్రవాహం కొనసాగుతోంది. జురాల, శ్రీశైలం, పులిచింతల, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలుతున్నారు. ఇక గోదావరి బేసిన్ ఎల్లంపల్లి పై భాగంలో వరద తక్కువగా ఉంది. దీంతో శ్రీరాంసాగర్ వరద నీరు తక్కువగా వస్తోంది. అయితే మేడిగడ్డ బ్యారేజీ వద్ద 1.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు.












Click it and Unblock the Notifications