హైదరాబాద్‌లో మళ్లీ దంచికొట్టిన వాన: కుంగిన రోడ్డు, కాలనీలు జలమయం, జిల్లాల్లోనూ

హైదరాబాద్: తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద రావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరదనీరు చేరడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పలేదు. అత్యధికంగా గాజులరామారాంలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్ట, బార్కస్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, ఉప్పుగూడా తదితర ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. సంతోష్‌​నగర్‌, సైదాబాద్, సరూర్‌నగర్‌, సికింద్రాబాద్‌, చిలకలగూడ, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్, రాణిగంజ్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో అక్కడక్కడ భారీ హోర్డింగ్‌లు నేలకొరిగాయి.

Heavy rains in hyderabad city and other telangana districts

రోడ్డుపై మోకాలు లోతులో వర్షం నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. సాయంత్రం వేళ కావడంతో ట్రాఫిక్​ స్తంభించి ఎక్కడికక్కడ వాహనాలు బారులుతీరాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దుండిగల్, బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది.

వాటితో పాటుగా అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పురాతో పాటు గండిపేట్, శంషాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సుచిత్ర, జీడిమెట్ల, సూరారంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. రోడ్లపై వర్షం నీరు ప్రవహించడంతో కాలువలను తలపించాయి.

గాజుల రామారంలో అత్యధికంగా 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా,
హయత్ నగర్,చంద్రయాన్ గుట్టలో 2.9 సెంటీమీటర్లు, మల్కాజ్ గిరిలో 2.8 సెంటీమీటర్లు, ఫాలక్ నుమాలో 2.3 సెంటీమీటర్లు.., అల్వాల్ లో 2 సెంటీమీటర్లు, ఎల్.బి.నగర్ లో 1.8 సెంటీమీటర్లు,
కర్వాన్ లో 1.3 సెంటీమీటర్లు, శివరాంపల్లి లో 1.1 సెంటీమీటర్లు నమోదైంది.

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి సైదాబాద్ పరిధి సంతోష్ నగర్ దగ్గర రోడ్డు కుంగిపోయింది. వెంటనే వాహనదారులు గమనించడంతో ప్రమాదం తప్పింది. డీఆర్ఎఫ్ బృందం వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనదారులను అప్రమత్తం చేశారు. సైదాబాద్, సంతోష్ నగర్, మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

హైదరాబాద్ తోపాటు తెలంగాణ ఇతర జిల్లాల్లోనూ సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్, తదితర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మరోసారి పెద్ద ఎత్తున పంటలు, ధాన్యాలు తడిసిముద్దవడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

మరోవైపు, రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+