తెలంగాణలో జోరు వానలు.. రేపు ఈ 5 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వర్ష బీభత్సానికి వాగులు, వంకలు తెగిపోయాయి. చెరువుల నుంచి వరద భారీగా ప్రవహిస్తున్న కారణంగా ఎక్కడికక్కడ రోడ్లు, కల్వర్టులు తెగిపోయాయి. అంతేకాక జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అటు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరి, నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. అటు నల్గొండ జిల్లాలోనూ రాత్రి నుంచి తెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. రహదారులపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.
అటు కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి నెలకొంది. రాజంపేటలో అత్యధికంగా 32 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాలకు కామారెడ్డి - నిజామాబాద్ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. అటు హైదరాబాద్ - నిజామాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలో భారీగా వరదనీరు చేరింది. దీంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కామారెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారి రాజు ప్రకటన ప్రకారం రేపు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, ములుగు జిల్లాల్లోనూ విద్యార్థుల తల్లిదండ్రులు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

అలాగే తెలంగాణలో భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బిక్నూరు మండలం తలమండ్ల సెక్షన్ లో ట్రాక్ పై వరద ప్రవహిస్తుండటంతో పలు రైళ్లను దారి మళ్లించింది దక్షిణ మధ్య రైల్వే. అక్కన్నపేట- మెదక్ సెక్షన్ పరిధిలో పలు రైళ్లను రైల్వే శాఖ మళ్లించింది. ముంబై - లింగంపల్లి, లింగంపల్లి - ముంబై, ఓఖా - రామేశ్వరం, భగత్ కి కోఠి - కాచిగూడ, నిజామాబాద్ - తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. అలాగే కాచిగూడ- మెదక్ ట్రైన్ కూడా పాక్షికంగా రద్దయింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications