Rains: మరో నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు..
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు పలు జిల్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ జేసింది. సోమవారనికి ఎలాంటి అలర్ట్ జారీ చేయని వాతావరణ శాఖ మంగళ, బుధవారాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
కాగా శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షం కుసింది. ఇటు హైదరాబాద్ లోనూ భారీ వాన పడింది. శనివారం మధ్యాహ్నం అరగంటపాటు కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. యూసఫ్ గూడ, బోరబండ, మోతినగర్, కేపీహెచ్బీ, కూకట్ పల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్ల పైకి నీరు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ తర్వాత మరోమారు వర్షం పండింది. రాత్రి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

వచ్చే మూడు రోజుల్లో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వెల్లడించింది. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల సీజన్ లో వర్షపాతం బాగాన ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది.

సాధారణంగా జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 నైరుతి రుతుపవనాల సీజన్ గా పరిగణిస్తారు. ఈ సీజన్ తెలంగామలో 72.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. మరోపైవు రుతుపవనాల తిరోగమనం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. అటు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications