Heat Wave: మండుతున్న తెలంగాణ.. 44.5 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Heat Wave) మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు నమోదువుతున్నాయి. చాలా చోట్లు 43 డిగ్రీలకు పైగా ఉష్టోగ్రత నమోదు అవుతుంది. అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఉమ్మడి ఆదిలాబాద్ లో కూడా భారీగా ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 44.3 డిగ్రీలు, మంచిర్యాల తుమ్మెరలో 43.9 డిగ్రీలు, కుమురంభీమ్ జిల్లా తిర్యాణిలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

ఏపీలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. తర్లుపాడు, పెద్దారవీడు, గుళ్లాపల్లిల్లో ఏకంగా 45డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు అయింది. మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్రంలోనే అత్యధికంగా తర్లుపాడులో 45.83 డిగ్రీలు నమోదైంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో కరెంటు డిమాండ్ కూడా పెరిగింది. ఫ్యాన్లు, ఏసీ, కూలర్ల వాడకం పెరగడంతో విద్యుత్ కు డిమాండ్ ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల్లో అనధికార కోత విధిస్తున్నట్లు తెలిసింది.

 summerheats

దేశ వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎండకాలంలో సౌత్ ఇండియాలో భారీగా ఉష్టోగ్రతలు నమోదు అవుతాయని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. అటు ఉత్తర భారతంలో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ 16న నవీ ముంబైలో నిర్వహించిన మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఫంక్షన్‌కు వచ్చిన వారిలో 11 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. మరో 50 ఆస్పత్రిలో చేరారు.

ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రతి ఏడాది జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలకు అత్యధిక మంది మృతి చెందుతున్న దేశాల జాబితాలో భారత్‌ నిలుస్తోంది. మన దేశంలో సుమారు 1.4 బిలియన్ల మంది జనాభా బయటే పనిచేస్తారు. దీంతో వారికి ఎలాంటి రక్షణ లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఎక్కువ సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు, కూలీలు, రిక్షా పుల్లర్లు వడదెబ్బకు బలవుతున్నారు. సోమవారం ఒడిశాలోని బరిపాడలో 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ విబాగం (ఐఎండి) వెల్లడించింది.

heatwave

దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండి పేర్కొంది. ఉత్తర భారత రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఒడిశాతో సహా పలు ప్రాంతాలకు ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. ఎండ తీవ్రతతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావడం లేదు. ఎండ వేడిమి తట్టుకోలేక చాలా మంది కూల్ డ్రింక్స్, ఐస్ క్రీముల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఎండల పట్ల జాగ్రత్త ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు. అత్యవమైతే తప్ప బయటకు రావొద్దని కోరుతున్నారు. అత్యవసరంగా బయటకు వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+