weather: నాల్గు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలర్ట్
హైదరాబాద్: రాష్ట్రంలో మరికొద్ది రోజులపాటు జోరువానలు కురువనున్నాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా మరి కొద్ది రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడునాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు, ఆదిలాబాద్, కుమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికాపటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
శుక్రవారం(ఆగస్టు 5న) కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతేగాక, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

ఈ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
శనివారం రోజున రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలు.. మళ్లీ వర్షాలు కురుస్తాయనడంతో బెంబేలెత్తిపోతున్నారు.












Click it and Unblock the Notifications