వీరంగం: ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిపాలైన హీరో ఉదయ్ కిరణ్
హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం హోటల్లో విధ్వంసం సృష్టించిన ఫేస్‌బుక్ హీరో ఉదయ్ కిరణ్‌ను పోలీసులు ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలించారు. సినిమా జీవితంలో హీరో అయిన ఉదయ్ కిరణ్.. డ్రగ్స్‌కు బానిసై ఆ తర్వాత జైలు పాలయ్యాడు. ఇప్పుడు ఏకంగా పిచ్చాసుపత్రి పాలయ్యాడు.
ఉదయ్ కిరణ్ తీవ్రంగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అయితే, అతనికి జైలులో డ్రగ్స్ దొరకలేదు. దీంతో, అతని మానసిక పరిస్థితి దారుణంగా మారింది. తోటి ఖైదీలు, జైలు అధికారులతోను అతను విచిత్రంగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతనిని మెంటల్ ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్పించారు.
అతను ఇన్నాళ్లు చంచల్ గూడ జైలులో ఉన్నారు. జైలులో విచిత్రంగా మాట్లాడుతున్నాడని, మానసిక పరిస్థితి బాగా లేనట్లుగా కనిపిస్తోందని, అందుకే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు వెల్లడించారు.

కాగా, పలు నేరాలకు పాల్పడుతూ తెలుగు రాష్ట్రాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న సినీ హీరో నండూరి ఉదయ్ కిరణ్‌పై ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
గత నెలలో జూబ్లిహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లోకి ప్రవేశం నిరాకరించినందుకు సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతడిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో, కాకినాడ, మాదాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సినీ హీరో నండూరి ఉదయ్ కిరణ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
గతంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని బార్‌లో తప్పతాగి చిందులు వేయడమే కాకుండా సిబ్బంది పైన దాడికి పాల్పడ్డాడు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని జిఆర్టీ గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో సోమవారం రాత్రి తప్పతాగి గందరగోళం సృష్టించాడు.












Click it and Unblock the Notifications