కేసీఆర్ హరితహారానికి మద్దతు: నిమ్మ చెట్టు నాటిన హీరో వెంకటేశ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత హరితహారం కార్యక్రమంలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ పాల్గొన్నారు. గురువారం ఆయన రామానాయుడు స్టూడియోలో మొక్కను నాటారు. తన జాతకం ప్రకారం విక్టరీ వెంకటేశ్ నిమ్మ చెట్టును నాటారు.

Hero Venkatesh Participates in Haritha Haram at Ramanaidu Studio

అనంతరం వెంకటేశ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ వస్తుందని, చెట్ల పెంపకంతో సిటీ చాలా అద్భుతంగా తయారవుతుందని చెప్పారు.

Hero Venkatesh Participates in Haritha Haram at Ramanaidu Studio

హరితహారం కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మొక్కలు నాటడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడానికి దోహాదపడుతుందని అన్నారు. భావితరాలను దృష్టిలో పెట్టుకుని మొక్కలను నాటడంతో పాటు అడవుల పరిరక్షణ కూడా ఎంతో ముఖ్యమని వెంకటేశ్ చెప్పారు.

Hero Venkatesh Participates in Haritha Haram at Ramanaidu Studio

మొక్కలతో తన చిన్నప్పటి అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా గ్రీనరీతో తనకు అనుంబంధం ఉందని చెప్పారు. చెట్ల సమక్షంలో ఉన్నప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, మనసంతా మంచి ఆహ్లాదకర వాతావరణలో ఉన్నట్లు ఉంటుందని చెప్పారు.

Also Read: తాతతో మనవడు: జాతక ప్రకారం మొక్కలు నాటిన కేసీఆర్ ఫ్యామిలీ (ఫోటోలు)

హరిత హారం కార్యక్రమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్న సంగతి తెలిసిందే. బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌‌తో పాటు కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు. బుధవారం నాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆరుగురు రాశి, జన్మ నక్షత్రం ఆధారంగా రెండు మొక్కల చొప్పున మొత్తం పన్నెండు మొక్కలను నాటారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tollywood Hero Venkatesh Participates in Haritha Haram at Ramanaidu Studio in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి