హైదరాబాద్‌లో హై అలర్ట్: ఆర్మీ ప్రాంతాల్లో ఆంక్షలు, అనుమతి లేదు
హైదరాబాద్: నగరంలోని ఆర్మీ ఉన్న ప్రాంతాల్లో శుక్రవారం నుంచి ఆంక్షలు విధించారు. భారత సైన్యం ఎల్ఓసీని దాటుకుని పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలోని నాగమందిర్, లాలాపేట్, ఏఓసీ రహదారులను ఇప్పటికే మూసివేశారు. అదే విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్, గొల్కొండ ప్రాంతాల్లోని ఆర్మీ ప్రాంతాల్లోకి పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పాసులు లేని వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆర్మీ అధికారులు సూచిస్తున్నారు.
రాత్రి 9 గంటల ప్రాంతం నుంచి ఉదయం 7 గంటల సమయం వరకు ఆర్మీ ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఉదయం 7 గంటల తర్వాత కూడా ఆర్మీ ప్రాంతాల్లోని రహదారులపైకి పెద్ద పెద్ద వాహనాలను అనుమతించడం లేదు. ఆర్మీ ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాతే అనుమతిస్తున్నారు.

గతంలో పెద్ద పెద్ద వాహనాలను అనుమతిస్తున్నప్పటికీ, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో గొల్కొండ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. కాగా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యూరీ ఉగ్రదాడిపై పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు.
కదనరంగంవైపు భద్రతా దశాలు అడుగులు వేస్తున్నాయి. సర్జికల్ స్ట్రయిక్స్ పేరిట పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. పక్కా ప్లాన్‌తో ఈ దాడులను భారత సైన్యం పూర్తి చేసింది. ఈ సర్జికల్ స్ట్రయిక్స్‌తో పాక్‌కు వణుకు పుట్టింది. మరోవైపు సరిహద్దుల్లో ఏ క్షణమైనా ఎటాక్‌కు సర్వం సిద్ధంగా ఉన్నారు.
అరేబియా సముద్రంలో పాక్‌కు సమీపంలో భారతీయ నేవీ విన్యాసాలను నిర్వహిస్తుంది. భారత్‌కు చెందిన 36 యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లతో యుద్ధ విన్యాసాలు నిర్వహించేందుకు భారత్ సిద్ధమైంది. ఈ విన్యాసాలతో పాక్ గుండెల్లో దడ పుట్టించాలనేది భారత్ ప్లాన్‌గా తెలుస్తోంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆక్టోపస్, సీఐఎస్‌ఎఫ్ బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. ఎయిర్‌పోర్టులోకి వచ్చే వాహనాలను, ప్రయాణికులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications