ఎందుకు?: గ్రేటర్ ఎన్నిక ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఆలస్యం పైన రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల తేదీతో కూడిన వివరణను వారంలోగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఏజీని న్యాయస్థానం ఆదేశించింది. స్థానిక ఎన్నికలపై నిర్లక్ష్యం తగదని పేర్కొంది. గ్రేటర్‌లో జీహెచ్ఎంసీ పాలన కొద్ది నెలల క్రితం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైదరాబాదులో అధికార తెరాసకు అంత పట్టులేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే తెరాస తలసాని శ్రీనివాస్ యాదవ్, కృష్ణారెడ్డి వంటి వారిని తమ పార్టీలో చేర్చుకుంది. అదేవిధంగా హైదరాబాదులోని సీమాంధ్రులను కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. హైదరాబాదులో పైన ఒకింత పట్టు సాధించాక ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో అధికార పార్టీ ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

High Court angry on delay of GHMC elections

భూముల క్రమబద్దీకరణపై హైకోర్టులో విచారణ

భూముల క్రమబద్దీకరణ పైన హైకోర్టులో విచారణ సాగుతోంది. జీవోలు 58, 59లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరుపుతోన్న న్యాయస్థానం నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది.

హైదరాబాద్‌లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు

హైదరాబాదులో ఆర్టీఏ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. సోమవారం ఉదయం ఎల్బీనగర్‌లో పలు వాహనాలను అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నాలుగు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను సీజ్‌ చేసిన అధికారులు ఓ బస్సు యజమానిపై కేసు నమోదు చేశారు. ఎల్బీ నగర్‌తో పాటు హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై పలు చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+