వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు ట్విస్ట్: మత్తయ్య పిటిషన్.. స్టీఫెన్ సన్‌పై హైకోర్టు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్. ఈ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పైన హైకోర్టు బుదవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు జడ్జి శివశంకర్ విచారించవద్దని స్టీఫెన్ సన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఏ4 నిందితుడిగా ఉన్న న్యాయమూర్తి తప్పుకోవాలని, కేసును మరో బంచ్‌కు బదలీ చేయాలని ఆయన గతంలో వేసిన తన పిటిషన్లో పేర్కొన్నారు.

ఓటుకు నోటుపై మెమో: రేవంత్‌కు సమన్లు, బాబుని విచారిస్తాం! 'ట్యాపింగ్' తెచ్చేనా?ఓటుకు నోటుపై మెమో: రేవంత్‌కు సమన్లు, బాబుని విచారిస్తాం! 'ట్యాపింగ్' తెచ్చేనా?

High Court angry with MLA stephenson over mathaiah quash petition case

ఆ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయమూర్తి దానిని తీవ్రంగా పరిగణిస్తూ స్టీఫెన్ సన్ పైన కోర్టు ధిక్కార అభియోగంగా పరిగణిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. స్టీఫెన్ సన్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ మత్తయ్య క్వాష్ పిటిషన్ పైన విచారణ చేపట్టింది.

అప్పట్లో స్టీఫెన్ సన్ పైన కేసు నమోదు చేశారు. దీనిపై బుధవారం నాడు విచారణకు వచ్చింది. స్టీఫెన్ సన్ కోర్టుకు హాజరుకాకపోవడంపై హైకోర్టు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే నెల (సెప్టెంబర్) 30వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

English summary
High Court angry with MLA stephenson over mathaiah quash petition case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X