హైకోర్టు ఏపీలోనే ఉండాలన్న తెలంగాణ: విస్తృత ధర్మాసనానికి బదలీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ అయింది. హైకోర్టు విభజన తీర్పును సమీక్షించాలన్న వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనం గురువారం నాడు బదిలీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏపీలోనే ఉండాలనే అంశాన్ని సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు కోరింది. హైకోర్టు విభజన కేసును నలుగురు లేదా ఐదుగురు న్యాయమూర్తులతో కూడి విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

High Court Division issue transferred to bench

కాగా, హైకోర్టు విషయమై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. అమరావతిలో హైకోర్టుకు ఏపీ స్థలం చూపించడం లేదని, హైకోర్టు విభజన త్వరగా జరగాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. తాము విభజనకు సిద్ధంగా ఉన్నామని ఏపీ చెబుతోంది.

వీసీల నియామకం మీద హైకోర్టు తీర్పు లక్ష్మణ్ హక్షం

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన తెరాస అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గురువారం అన్నారు. రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. గవర్నర్ ప్రమేయం లేకుండా వీసీల నియామకం సరికాదన్నారు. వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court Division issue transferred to bench.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి