బ్రేక్‌ఫాస్ట్, భోజనాలకు అన్ని లక్షల డబ్బులా: ఆశ్చర్యపోయిన హైకోర్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబా: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) నాలుగు రోజులకు అల్పాహారం, భోజనం నిమిత్తం రూ. 75.78 లక్షలు ఖర్చు విస్మయం వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం కెపాసిటీలో 25 శాతం కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది.

హెచ్‌సిఏ వ్యవహారాలపై తాము పరిశీలించిన అంశాలను హైకోర్టుకు తెలియపరుస్తూ హైదరాబాద్‌లో ఐపిఎల్ 2017 మ్యాచ్‌ల నిర్వహణకు పర్యవేక్షకుడు లేదా పరిశీలకుడిని నియమించాలంటూ బిసిసిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు నాలుగు రోజుల మ్యాచ్ సందర్భంగా హెచ్‌సిఏ అనవసరంగా నిధులు ఖర్చుపెట్టిందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

High Court finds fault with HCA

తెలంగాణలో యువతకు క్రికెట్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఈ సొమ్ము ను ఉపయోగించి ఉండాల్సిందని చెప్పింది. మ్యాచ్ జరిగిన నాలుగు రోజుల పాటు రోజుకు రెండు వేల మంది పోలీసులను స్టేడియంలో నియమించారని, ఈ విషయాన్ని కూడా హెచ్‌సిఏ పట్టించుకోలేదని కోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు ఎంత మంది అవసరమో కూడా హెచ్‌సిఏ గుర్తించలేకపోయిందంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది.

బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కు ఇంత పెద్ద మొత్తంలో సొమ్మును ఖర్చుపెట్టడాన్ని సమర్ధించుకోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. స్టేడియం కెపాసిటీ 39 వేల సీట్లు అయితే, హెచ్‌సిఏ దాదాపు 11500 కాంప్లిమెంటరీ పాస్‌లు ఇచ్చిందని బిసిసిఐ కోర్టుకు తెలిపింది.

కాగా హెచ్‌సిఏ మాత్రం తాము 3860 కాంప్లిమెంటరీ పాస్‌లు ఇచ్చామని, జస్టిస్ ఆర్‌ఎం లోధా కమిటీ సిఫార్సుల మేరకు పది శాతం లోపు పాస్‌లు ఇచ్చామని సమర్థించుకుంది. బిసిసిఐ సూచనల మేరకు ఐదు వేల మంది విద్యార్ధులకు పాస్‌లు ఇచ్చామని హెచ్‌సిఏ కోర్టుకు తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court found fault with Hyderabad Cricket Association (HCA) foe spending lakhs of rupees foe breakfast and lunch during India, Bangaladesh test match.
Please Wait while comments are loading...