జగన్ అక్రమాస్తుల కేసు: త్వరగా తేల్చాలని సిబిఐకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం చేయాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
ఈ సందర్భంగా డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది. అయితే, వీలైనంత త్వరగా వాటిని తేల్చాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు నిందితులుగా ఉన్నందున విచారణలో జాప్యం తగదని అర్జీదారు సదరు పిటిషన్‌లో పేర్కొన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. కేసులో నిందితులైన జగన్, విజయ సాయి రెడ్డి తదితరులు పలామార్లు కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే.జగన్ ఆస్తుల కేసులో సిబిఐ పలు ఛార్జీషీట్లు దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications