ఆంధ్రా స్టడీ సెంటర్లను మూసేయొద్దు: హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు యూనివర్సిటీల స్టడీసెంటర్ల నిర్వహణపై హైకోర్టు శుక్రవారంనాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్టడీ సెంటర్లను మూసివేయవద్దని ఆదేశించింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించాలని తెలిపింది.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం 8 వారాల్లో సమస్యలు పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీలోని స్టడీ సెంటర్లను కొనసాగించడం వల్ల రూ. 14 కోట్లు జీతాలు చెల్లించామని హైకోర్టుకు తెలంగాణ ఏజీ తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఖర్చులు చెల్లిస్తే స్టడీ సెంటర్ల నిర్వహణకు ఇబ్బంది లేదని తెలంగాణ ఏజీ కోర్టుకు స్పష్టం చేశారు.

ఎంఆర్ఆర్ గ్టాంట్లపై సుప్రీం
తెలంగాణలో ఎంఆర్‌ఆర్ గ్రాంట్ల నిధులు దుర్వినియోగమవుతున్నాయంటూ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. విచారణను త్వరగా పూర్తి చేయాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతలు, కార్యకర్తలకే కాంట్రాక్ట్‌లు ఇస్తున్నారని ఆరోపిస్తూ గతంలో కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఎంఆర్‌ఆర్ గ్రాంట్ల నిధుల ద్వారా టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకే లబ్ది చేకూరుతోందనీ, రూ. 500 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కాంగ్రెస్ నేత హర్షవర్దన్‌రెడ్డి ఆరోపించారు. వేలం ద్వారా రోడ్డు పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications