వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డికె అరుణ భర్త అక్రమ మైనింగ్‌కు హైకోర్టు చెక్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యురాలు డికె అరుణ భర్త డికె భరతసింహారెడ్డి అక్రమ మైనింగ్‌కు హైకోర్టు చెక్ పెట్టింది. మహబూబ్‌నగర్ జిల్లాలో అక్రమ మైనింగ్‌లు వెంటనే నిలిపివేయాలని భరతసింహారెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మైనింగ్ అధికారులు విధించిన రూ. 32 కోట్ల జరిమానాను వసూలు చేయాలని ఆదేశించింది.

మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండలం మన్నూరులో భరతసింహారెడ్డి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఫాస్ట్‌పై హైకోర్టు విచారణ

High Court orders to stop Bharatsimha Reddy's illegal mining

విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్‌ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫాస్ట్‌ పథకంపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఫాస్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కౌంటర్‌ దాఖలు చేయడంపై పునరాలోచిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో కేసువిచారణ 15రోజులకు కోర్టు వాయిదా వేసింది.

పరిశ్రమలపై జూపల్లి సమీక్ష

పరిశ్రమ శాఖపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి పరిశ్రమల శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో జిల్లాల వారీగా ఎస్‌ఈజెడ్‌లు, పారిశ్రామికవాడల అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇతర కంపెనీల పెట్టుబడుల అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం.

English summary
The High Court ordered to stop Congress MLA DK Aruna's husband Bharatsimha Reddy's illegal mining in Mahaboobnagar district of Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X