కేసీఆర్‌కు షాక్: హైకోర్టు సీరియస్, సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు బ్రేక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పైన హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. వారసత్వ ఉద్యోగాలపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిని స్వీకరించిన హైకోర్టు దీనిని తప్పుబట్టింది.

వారసత్వ ఉద్యోగాల ప్రకటనను హైకోర్టు రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ గ్రౌండ్స్ ప్రకారం ఫిట్ అయితేనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పింది.

high court

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలివ్వాలన్న ప్రభుత్వ ప్రకటన పైన హైకోర్టు సీరియస్ అయింది. వారసత్వ ఉద్యోగాలకు ఇటీవలే కేసీఆర్ ప్రభుత్వం ఓకే చెప్పింది. హైకోర్టులో మాత్రం చుక్కెదురయింది. ప్రకటనను రద్దు చేసింది.

మెడికల్ అన్ ఫిట్‌గా ఉండి కుటుంబానికి ఆధారం లేకపోతే వారసులకు ఉద్యోగం ఇవ్వవచ్చునని, అంతేకానీ మొత్తం వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. కొత్త నోటిఫికేషన్ లేకుండా నిరుద్యోగులకు నష్టం కలుగుతుందని పిటిషనర్ తరఫు లాయర్ హైకోర్టులో చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court on Thursday cancelled depended jobs in Singareni and ordered Government to release fresh notifications.
Please Wait while comments are loading...