వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుత్తాకు హైకోర్టు షాక్: పిటిషన్ ఉపసంహరణకు నో

నల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిపై మంగళవారం నాడు హైకోర్డు అగ్రహం వ్యక్తం చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిపై మంగళవారం నాడు హైకోర్డు అగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులను నియమించి వారికి మంత్రి హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై మంగళవారంనాడు మరోసారి విచారణకు వచ్చింది. తన వ్యాజ్యాన్ని ఉపసంహ‌రించుకోవడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆయ‌న కోరారు. గుత్తా సుఖేందర్ రెడ్డి తరపు న్యాయవాది. గుత్తా సుఖేందర్రెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు.

 High court serious on Nalgonda MP Gutta Sukhender reddy

కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని వ్యాఖ్యానించింది. పిటిషన్ ఉపసంహ‌రణకు అనుమతి నిరాకరించింది. పిటిషనర్‌ వెనక్కి తగ్గినా తాము విచారణ కొనసాగిస్తామని పేర్కొంది.

పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై కూడ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాలంలో సుఖేందర్‌రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొన్న కొన్ని నిర్ణయాలను కోర్టులో సవాల్ చేశారు.

అయితే కొంత కాలం క్రితం సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరారు. దీంతో కోర్టులో ప్రభుత్వ సలహదారులకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ తీసుకొన్న నిర్ణయంపై పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలని భావించారు.

English summary
The High court serious on Nalgond MP Gutta Sukhendhar reddy on Tuesday. Sukhender reddy's advocate urged to court withdraw petition against state government. Court not accepted sukhendra reddy's request.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X