రేపు తెలంగాణ బంద్..ఎందుకంటే..?
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో హైకోర్టు తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ, సామాజిక ప్రకంపనలు సృష్టిస్తోంది. బీసీ (BC) వర్గాలకు ఊరటనిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 అమలుపై హైకోర్టు స్టే విధించడంతో బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
తమకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ అయిన జీవో అమలు ఆగిపోవడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల నాయకులు వెంటనే రంగంలోకి దిగారు. నిరసనకారులు హైకోర్టు ఆవరణలోనే గుమిగూడి ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా, కోర్టు స్టేకు వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేశారు. "బీసీల హక్కులను కాలరాయవద్దు" అంటూ నినాదాలు చేశారు.

ఈ పరిణామంపై తీవ్ర అసంతృప్తి చెందిన బీసీ సంఘాలు ఉమ్మడిగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. బీసీల రిజర్వేషన్లను కాపాడాలని డిమాండ్ చేస్తూ, రేపు (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఈ బంద్ పిలుపుతో రాష్ట్రంలో రవాణా, వాణిజ్య కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 42 శాతం రిజర్వేషన్లు దక్కే వరకు పోరాటం ఆపేది లేదని బీసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. బీసీల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో, హైకోర్టు తదుపరి విచారణ, ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.












Click it and Unblock the Notifications