తెలంగాణ స్పీకర్ కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : తెలంగాణ స్పీకర్ మధుసూధనా చారికి ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీర్ఎస్ లో టీడీపీ ఎమ్మెల్యేల చేరికను ఆమోదిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నోటీసులు జారీ చేసింది హైకోర్టు.
టీఆర్ఎస్ లో టీడీఎల్పీ విలీనంపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిటిషన్ స్వీకరించిన హైకోర్టు.. సోమవారం నాడు విచారణ చేపట్టింది. విలీనానికి సంబంధించి టీడీపీకి చెందిన 12 మంది మ్మెల్యేలు టీఆర్‌ఎస్ లో చేరి టీడీపీని అధికార పార్టీలో కలిపేస్తున్నట్లుగా స్పీకర్ గా లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన స్పీకర్ అప్పట్లోనే విలీనాన్ని ధ్రువీకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఈ విలీనం చెల్లదంటూ గట్టిగా వాదించిన టీడీపీ నేతలు.. దీనిపై తేల్చుకునేందుకు హైకోర్టు మెట్లెక్కారు. విచారణ చేపట్టిన కోర్టు సోమవారం స్పీకర్ కు నోటీసులు పంపించింది.












Click it and Unblock the Notifications