ఇంటర్ బోర్డుపై హైకోర్టు గుస్సా : విద్యార్థుల జీవితంతో ఆడుకోవడం ఏంటని ప్రశ్న
హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో బోర్డు అవలంభించిన నిర్లక్ష్య వైఖరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఏంటని ప్రశ్నించింది. ఇంటర్ పరీక్ష ఫలితాల రీ వాల్యుయేషన్‌పై నిర్ణయం తెలుపాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారించి .. ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అలా ఎలా ?
ఇంటర్ ఫలితాల్లో 3 లక్షల మంది వరకు ఎలా ఫెయిల్ అవుతారని ప్రశ్నించింది. విద్యార్థుల, తల్లిదండ్రుల డిమాండ్ మేరకు రీ వాల్యుయేషన్ పై బోర్డు నిర్ణయం తెలుపాలని హైకోర్టు ధర్మాసనం కోరింది. విద్యార్థుల పునర్ మూల్యంకనం కోసం ఎంత సమయం పడుతోందని ప్రశ్నించింది. మొత్తం విద్యార్థుల ఫలితాలు వెల్లడించేందుకు నెలరోజుల సమయం పడితే .. 3 లక్షల మంది విద్యార్థుల రీ వాల్యుయేషన్ కు రెండు నెలలు ఎలా పడుతుందని నిలదీసింది.

అన్యాయమే ?
అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన జ్యుడీషియల్ విచారణతో విద్యార్థులకు న్యాయం జరగదని హైకోర్టు అభిప్రాయపడింది. విద్యార్థులు ఏడాది నష్టపోకుండా .. చేపట్టే చర్యలను వివరించాలని ఇంటర్ బోర్డును కోరింది. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు .. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications