ఎక్కడున్నా శోభాయాత్రకు హాజరు: హిమాచల్ గవర్నర్ హోదాలో బండారు: తమిళిసైతో భేటీ
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం హైదరాబాద్ కు చేరుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఆ రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన స్వరాష్ట్రానికి వచ్చారు.
వినాయక విగ్రహాల శోభాయాత్రలో పాల్గొన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నగరంలోని మొజాంజాహి మార్కెట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాల స్వాగత కార్యక్రమానికి గవర్నర్ హోదాలో హాజరయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతకుముందు- ఆయన రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను మర్యాదపూరకంగా కలిశారు. శాలువ కప్పి సన్మానించారు. వారిద్దరి మధ్య సుమారు 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. హైదరాబాద్ గణేష్ నిమజ్జనం శోభాయాత్రతో తనకు ఉన్న అనుబంధాన్ని దత్తాత్రేయ ఆమెతో పంచుకున్నారు. తాను ఎక్కడ ఉన్నా శోభాయాత్రకు తప్పకుండా హాజరవుతానని చెప్పారు. ఈ కారణంతోనే తాను గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే హైదరాబాద్ కు బయలుదేరి రావాల్సి వచ్చిందని అన్నారు.












Click it and Unblock the Notifications