హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 10వేల కోట్ల రాబడే టార్గెట్: హెచ్ఎండీఏ భూముల అమ్మకాలకు కేసీఆర్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మంత్రివర్గ సమావేశం సమావేశంజరిగింది. రెండున్నరగంటలకుపైగా సాగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో భూముల విక్రయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

భూముల అమ్మకంతో రూ. 10 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని టీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. ఉప్పల్ బగాయత్ తరహాలోనే ల్యాండ్ పూలింగ్‌కు వెంచర్లపై ఈ సమావేశం మొగ్గుచూపినట్లు తెలిసింది.

రాష్ట్ర ఖజానాకు ఆదాయ మార్గాలపైనే కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అంతేగాక, భూముల మార్కెట్ విలువ పెంపుపైనా చర్చలు కొనసాగుతున్నాయి. భూములు అమ్మి రూ. 10 వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించిన కేబినెట్ సమావేశం.. మోకిళ్ల, ప్రతాపసింగారం, మేడ్చల్ జిల్లా కొర్రెమెలలో వెంచర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది.

HMDA lands for sale: TRS govt targets rs. 10 thousand crores

రెవెన్యూ చట్ట సవరణపై అధికారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 28న శంషాబాద్‌లో రెవెన్యూ సమ్మేళనం నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌పైనా చర్చ జరిగింది. ఇకపై రోగులకు వైద్య పరీక్షలు ఉచితంగా అందించే యోచన. దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వారికి ప్రభుత్వం పింఛను అందించాలనే నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా చర్చ జరిగింది. కాగా, ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ఉద్యోగులు.. పీఆర్సీలాంటి ఏదైనా తీపి కబురు అందితుందేమోనని చూస్తున్నారు.

English summary
HMDA lands for sale: TRS govt targets rs. 10 thousand crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X