హోలీకి కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు
Special Trains from Kachiguda Railway Station: ఈ నెల 14వ తేదీన హోలీ. ఈ సందర్భంగా స్వస్థలాలకు బయదులేరి వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. కాచిగూడ నుంచి రాజస్థాన్‌కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొత్తం నాలుగు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 11వ తేదీన తొలి రైలు పట్టాలెక్కనుంది.
దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ శ్రీధర్ విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 11, 16 తేదీల్లో రాత్రి 11:33 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 07701 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12:50 నిమిషాలకు మదార్ స్టేషన్‌కు చేరుకుంటుంది.

ఈ నెల 13, 18 తేదీల్లో సాయంత్రం 4:05 నిమిషాలకు మదార్ స్టేషన్ నుంచి బయలుదేరే నంబర్ 07702 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. అజ్మీర్ సిటీలో ఉంటుందీ మదార్‌పుర స్టేషన్.
మల్కాజ్‌గిరి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందెడ్, పూర్ణ, వషీం, అకోలా, షెగావ్, మల్కాపూర్, బర్హాన్‌పూర్, ఖండ్వా, రాణి కమలాపతి, సీహోర్, ఉజ్జయినీ, రత్లాం, జోరా, మందసర్, నీమచ్, చిత్తోడ్‌గఢ్, భిల్వారా, బిజైనగర్, నజీరాబాద్, అజ్మీర్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రాజస్థానీయులు నివసిస్తోన్న విషయం తెలిసిందే. వాళ్లందరి సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. హోలీ- రాజస్థానీయులకు పెద్ద పండగ. ప్రతి సంవత్సరం వాళ్లు స్వస్థలాలకు వెళ్లి కుటుంబ సభ్యుల మధ్య హోలీని సంతోషంగా జరుపుకొంటుంటారు.












Click it and Unblock the Notifications