Holi event: కాజల్ వస్తుందనడంతో టికెట్లు కొని వెళితే..!
హైదరాబాద్ నగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు హోలీ సంబరాల్లో మునిగితేలారు. ఖాళీ మైదానాల్లో, రోడ్లపైనా యువత హోలీ రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా తిరిగారు. దీంతో హైదరాబాద్ నగరంలోని రోడ్లన్నీ రంగులమయమయ్యాయి.అయితే,హోలీ వేడుకల సందర్భంగా పలు సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి.
కాగా, ఓ ఈవెంట్ నిర్వాహకులు ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ తోపాటు పలువురు సినీ నటులు కార్యక్రమానికి అతిథులుగా వస్తున్నారంటూ టికెట్లను విక్రయించారు. డీజేలు, రెయిన్ డ్యాన్స్ లాంటి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో హోలీతోపాటు వీకెండ్ కూడా కలిసి రావడంతో చాలా మంది పెద్ద ఎత్తున టికెట్లను కొనుగోలు చేశారు.

తీరా శుక్రవారం హోలీ సంబరాలను జరుపుకునేందుకు ఎంతో ఉత్సాహంగా వెళ్లినవారికి ఊహించని షాక్ తగిలింది. సదరు నిర్వాహకులు చేపట్టిన హోలీ ప్రత్యేక కార్యక్రమానికి కాజల్ కాదు కదా.. జూనియర్ ఆర్టిస్లుటులు కూడా రాలేదు. దీంతో ఈవెంట్ నిర్వాహకులపై ఉత్సాహంతో వచ్చిన యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేగాక, శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈవెంట్స్ ప్లాన్ చేశామని నిర్వాహికులు చెప్పినప్పటికీ.. పోలీసులు రంగప్రవేశం చేసి ఒంటిగంటకే అక్కడ్నుంచి బయటకు పంపడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు యువతీయువకులు. వేల రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేస్తే నిర్వాహకులు మోసం చేశారంటూ మండిపడుతున్నారు. ఈ ఈవెంట్లో డీజేలు కూడా సరిగ్గా పనిచేయలేదని వాపోయారు.
మాదాపూర్‌లోని మ్యాన్ మేడ్ హిల్స్‌లో హోలీ నేషన్ పేరిట ఈవెంట్ ప్లాన్ చేసి కాజల్ వస్తుందంటూ నమ్మించి మోసం చేశారని హాజరైన యువతీయువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, కోకాపేటలోని ప్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్‌లో కూడా వేల రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు సరైన ఏర్పాటు చేయలేదని యువత ఫైరయ్యారు. తాము ఇచ్చిన టికెట్ డబ్బులను రీఫండ్ చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications