సచివాలయాన్ని ముట్టడించిన హోంగార్డులు: ఉద్రిక్తత, లాఠీఛార్జ్
హైదరాబాద్: తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న హోంగార్డులు తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. గురువారం సీఎస్ రాజీవ్‌శర్మతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో హోంగార్డులు సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు.

ఇందిరాపార్కు నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చిన హోంగార్డులు ఒక్కసారిగా సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా సచివాలయం గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేపట్టారు.
పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేసి హోంగార్డులను అక్కడ్నుంచి తరలించారు. హోంగార్డుల సంఘం నేతలు మాట్లాడుతూ.. తమకు సెలవులు, హెల్త్ కార్డులు, తమ ఉద్యోగాల భద్రత కావాలని అన్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications